idols at Palnadu Road: పల్నాడు జిల్లా నరసరావుపేటలో విగ్రహాల ఏర్పాటు విషయమై కోర్టు స్టే ఇచ్చినా పనులు బుధవారం సైతం కొనసాగాయి. పల్నాడురోడ్డులో విగ్రహాలను ఏర్పాటు చేయడం సుప్రీంకోర్టు తీర్పునకు విరుద్ధమని, దీనిపై చర్యలు తీసుకోవాలని హైకోర్టు మంగళవారం.. కలెక్టర్, మున్సిపల్ శాఖ ముఖ్య కార్యదర్శికి ఆదేశాలు జారీ చేసింది. ఆ రోజు మధ్యాహ్నం ఉత్తర్వులు జారీ చేస్తే మంగళవారం రాత్రి వరకూ పల్నాడు రోడ్డులో వైఎస్సార్ విగ్రహ ఏర్పాటు పనులు జరిగాయి. బుధవారం మధ్యాహ్నం వరకు కూడా పనులు కొనసాగించారు. దీనిపై తెదేపా నియోజకవర్గ ఇన్‌ఛార్జి అరవిందబాబు.. కలెక్టర్ శివశంకర్‌కు ఫిర్యాదు చేసి విగ్రహ ఏర్పాటు పనులు నిలిపివేయించాలని కోరారు. కలెక్టర్ సానుకూలంగా స్పందించినట్లు ఆయన తెలిపారు. మున్సిపల్ కమిషనర్ రవీంద్ర వివరణ కోరగా స్పందించలేదు.
idols at Palnadu Road: కోర్టు స్టే ఇచ్చినా కొనసాగిన విగ్రహ ఏర్పాటు పనులు - విగ్రహాల ఏర్పాటుపై మున్సిపల్ కార్యదర్శికి అదేశాలు
idols at Palnadu Road: పల్నాడు రోడ్డులో విగ్రహాల ఏర్పాటుపై చర్యలు తీసుకోవాలని కలెక్టర్, మున్సిపల్ శాఖ ముఖ్య కార్యదర్శికి హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. విగ్రహాల ఏర్పాటు సుప్రీం కోర్టు తీర్పునకు విరుద్ధమని స్పష్టం చేసింది.
విగ్రహ ఏర్పాటు