ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

పబ్​లు రాత్రి 10 తర్వాత శబ్ద కాలుష్యం సృష్టిస్తే కేసులు పెట్టండి - తెలంగాణ హైకోర్టు తాజా వార్తలు

High Court on Pubs: పబ్​లు రాత్రి 10 తర్వాత సంగీత హోరుతో శబ్ద కాలుష్యం సృష్టిస్తే.. చర్యలు తీసుకోవాలని తెలంగాణ హైకోర్టు, పోలీసులను ఆదేశించింది. పబ్​ల నిర్వహణలో కోర్టు ఆదేశాలను.. అమలు చేయాల్సిందేనని పేర్కొంది.

pub
pub

By

Published : Sep 27, 2022, 11:22 AM IST

Updated : Sep 27, 2022, 11:55 AM IST

High Court on Pubs: పబ్​ల నిర్వహణలో నిబంధనలు, కోర్టు ఇచ్చిన ఆదేశాలను.. కఠినంగా అమలు చేయాలని పోలీసులకు తెలంగాణ హైకోర్టు స్పష్టం చేసింది. రాత్రి 10 తర్వాత సంగీత హోరుతో శబ్ద కాలుష్యం సృష్టిస్తే.. కేసులు నమోదు చేసి చర్యలు తీసుకోవాలని పేర్కొంది. నివాస ప్రాంతాల్లో పబ్​లకు అనుమతిచ్చే ముందు నిబంధనలు అమలు చేశారా, లేదా అనే అంశంపై పూర్తి వివరాలతో కౌంటర్​ దాఖలు చేయాలని.. ఎక్సైజ్​ శాఖను ఆదేశించింది. గతంలో ఇచ్చిన ఆదేశాలు ఉల్లంఘిస్తే.. తీవ్రంగా పరిగణిస్తామని కోర్టు హెచ్చరించింది.

నివాస ప్రాంతాల్లోని పబ్​లు సంగీతహోరుతో శబ్ద కాలుష్యం సృష్టిస్తున్నా పోలీసులు పట్టించుకోవట్లేదని.. అక్కడకు వచ్చే వారు వాహనాలను ఇళ్ల ముందే నిలుపుతున్నా చూసీచూడనట్లు వ్యవహరిస్తున్నారని దాఖలైన పిటిషన్లపై హైకోర్టు విచారణ చేసింది. గతంలో న్యాయస్థానం ఇచ్చిన ఆదేశాల మేరకు.. సైబరాబాద్, రాచకొండ పోలీస్ కమిషనర్లు కౌంటర్లు దాఖలు చేశారు. సైబరాబాద్​లో 34, రాచకొండలో 2 పబ్​లు ఉన్నాయని.. వాటిలో లౌడ్​ స్పీకర్ల వినియోగానికి అనుమతివ్వలేదని.. కౌంటర్లలో పేర్కొన్నారు. హైదరాబాక్​ కమిషనర్​ తరఫున కౌంటర్​ దాఖలుకు మరికొంత సమయం కావాలని.. ప్రభుత్వ న్యాయవాది కోరారు. ఈ మేరకు పోలీసులు, ఎక్సైజ్​ శాఖ కౌంటర్​ దాఖలు చేయాలని హైకోర్టు ఆదేశించింది.

ఇవీ చూడండి..

Last Updated : Sep 27, 2022, 11:55 AM IST

ABOUT THE AUTHOR

...view details