ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

పురపాలక ఎన్నికలకు తొలగిన న్యాయపరమైన అవరోధాలు

రాష్ట్రంలో పురపాలక సంఘాల ఎన్నికలకు న్యాయపరమైన అవరోధాలన్నీ తొలగిపోయాయి. పురపాలక సంఘాల ఎన్నికలకు తాజా నోటిఫికేషన్‌ ఇవ్వాలని దాఖలైన రిట్‌ అప్పీళ్లను హైకోర్టు కొట్టివేసింది. ఇవాళ ధర్మాసనం ముందు రిట్‌ అప్పీళ్లపై విచారణ జరిగింది.

high court on writ appeal over Municipality elections
high court on writ appeal over Municipality elections

By

Published : Mar 2, 2021, 5:08 PM IST

పురపాలక సంఘాల ఎన్నికలకు సంవత్సరం క్రితం ఇచ్చిన నోటిఫికేషన్‌ను ఇప్పుడు కొనసాగించటం నిబంధనలకు విరద్ధమని పిటిషనర్లు పేర్కొన్నారు. కొవిడ్‌ వలన సామాజిక మార్పులు జరిగాయని వాదించారు. ఇప్పటికే ఎన్నికలు నిర్వహించాలని సింగిల్‌ బెంచ్‌ ఉత్తర్వులు ఇచ్చిన విషయాన్ని అపీల్‌ సందర్భంగా న్యాయమూర్తి ప్రస్తావించారు. ఇరు వర్గాల వాదనలు విన్న అనంతరం అప్పీళ్లను హైకోర్టు కొట్టివేసింది. ఎన్నికలు యథావిధిగా జరుగుతాయని ఆదేశించింది.

ABOUT THE AUTHOR

...view details