ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

HC ON WOMEN POLICE: వారిని ఒత్తిడి చేయవద్దు : హైకోర్టు

HC ON WOMEN POLICE:వార్డు, గ్రామ మహిళా సంరక్షణ కార్యదర్శిలను మహిళా పోలీసులుగా గుర్తిస్తూ... ప్రభుత్వం తీసుకువచ్చిన జీవో 59 పై దాఖలైన పిటిషన్లపై హైకోర్టు విచారణ జరిపింది. మహిళ సంరక్షణ కార్యదర్శులను పోలీసులుగా ఉండాలంటూ ఒత్తిడి చేయవద్దని ప్రభుత్వానికి హైకోర్టు మౌఖికంగా సూచించింది .

HC
HC

By

Published : Jan 26, 2022, 3:57 AM IST

HC ON WOMEN POLICE: గ్రామ , వార్డు నచివాలయాల్లోని మహిళ సంరక్షణ కార్యదర్శులను పోలీసులుగా ఉండాలంటూ ఒత్తిడి చేయవద్దని ప్రభుత్వానికి హైకోర్టు మౌఖికంగా సూచించింది . హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ప్రశాంతకుమార్ మిశ్రా నేతృత్వంలోని ధర్మాసనం ఈ మేరకు స్పష్టంచేసింది. మహిళ సంరక్షణ కార్యదర్శులను పోలీసు శాఖలో ' మహిళ పోలీసులు'గా పరిగణిస్తూ ప్రభుత్వం జారీచేసిన జీవో 59 ని సవాలు చేస్తూ దాఖలు చేసిన పిటిషనర్ల తరఫు న్యాయవాది నర్రా శ్రీనివాసరావు అత్యవసర విచారణ జరపాలని కోరారు. కార్యదర్శులను పోలీసులు పరిగణించే వ్యవహారంలో ప్రభుత్వం ముందుకెళుతోందన్నారు. సుమారు 100 మంది పిటిషనర్లకు పోలీసులుగా ఉండటం ఇష్టం లేదన్నారు. ఒత్తిడి చేయకుండా ప్రభుత్వాన్ని నిలువరించాలన్నారు. ప్రభుత్వం తరఫు న్యాయవారి వివేకానంద్ స్పందిస్తూ .. జీవో 59 స్థానంలో సమగ్ర వివరాలతో కొత్త ఉత్తర్వులిచ్చామన్నారు. అభ్యంతరం ఉంటే ఆ జీవోను సవాలు చేసుకోవాలన్నారు. ప్రస్తుత వ్యాఖ్యాలు నిరర్థకం అవుతాయన్నారు. ఇరువైపు వాదనలు విన్న ధర్మాసనం... ఈ వ్యవహారంపై తర్వాత విచారణ చేపడతామని తెలిపింది.

ABOUT THE AUTHOR

...view details