ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

బౌద్ధక్షేత్రంలో ఇళ్ల స్థలాల పంపిణీపై అధికారులకు నోటీసులు - విశాఖ మంగమారిపేట ఇళ్ల స్థలాలపై హైకోర్టు కామెంట్స్

విశాఖ జిల్లా మంగమారిపేట గ్రామం తోట్లకొండ బౌద్ధక్షేత్రం పరిధిలో ఇళ్ల స్థలాలు ఇచ్చేందుకు అధికారులు యత్నిస్తున్నారంటూ దాఖలైన ప్రజాహిత వ్యాజ్యంపై హైకోర్టు స్పందించింది. రెవెన్యూశాఖ ముఖ్య కార్యదర్శి , విశాఖ జిల్లా కలెక్టర్, పురావస్తుశాఖ సహాయ డైరెక్టర్ తదితరులకు నోటీసులు జారీచేసింది. పూర్తి వివరాలతో కౌంటర్లు దాఖలు చేయాలని ఆదేశిస్తూ విచారణను ఈనెల 15కు వాయిదా వేసింది.

high court on vishaka buddha kshetra
high court on vishaka buddha kshetra

By

Published : Sep 10, 2020, 11:04 PM IST

ఎన్నో ఏళ్ల చరిత్ర కలిగిన బౌద్ధక్షేత్రం ఉన్న తొట్లకొండ పరిధిలో పేదలందరికి ఇళ్లు పథకం కింద 20 ఎకరాల్లో స్థలాలు ఇచ్చేందుకు అధికారులు యత్నిస్తున్నారని పేర్కొంటూ... సామాజిక కార్యకర్త కొత్తపల్లి వెంకట రమణరావు హైకోర్టులో పిల్ వేశారు. బౌద్ధారామంలో ప్రార్థనలు చేసేందుకు విదేశీయులు వస్తుంటారని పిటిషనర్ తరఫు న్యాయవాది శ్రీమన్నారాయణ వాదనలు వినిపించారు. ఆ ప్రాంత భూమి పురావస్తు శాఖ పరిధిలోకి వస్తుందన్నారు.

3148 ఎకరాల విస్తీర్ణమున్న ఆ ప్రాంతలో గతంలో పర్యాటకశాఖ ఆతిథి గృహాన్ని నిర్మించబోగా హైకోర్టు స్టే ఇచ్చిందన్నారు. కొండపై ఉన్న 120 ఎకరాల్లో నిర్మాణాలు వద్దని హైకోర్టు చెప్పిందని ప్రభుత్వ తరఫు న్యాయవాది వాదించారు. పురావస్తుశాఖ పరిధిలోకి రాని 20 ఎకరాల్లో ఇళ్ల స్థలాలు ఇస్తున్నామని తెలిపారు. వాదనలు విన్న ధర్మాసనం.. పూర్తి వివరాలతో కౌంటర్ దాఖలు చేయాలని.. విచారణను ఈ నెల 15కు వాయిదా వేసింది.

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details