ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

'ఆధార్ లేదు.. టీకా అందదు' కథనంపై స్పందించిన హైకోర్టు - ఆధార్ కార్డులు లేని వృద్ధులకు కొవిడ్ టీకా నిరాకరించడంపై హైకోర్టులో విచారణ

ఆధార్ కార్డులు లేని వృద్ధులకు కొవిడ్ టీకా నిరాకరించడంపై 'ఆధార్ లేదు.. టీకా అందదు' పేరుతో ఈనాడులో ప్రచురితమైన కథనంపై హైకోర్టు స్పందించింది. నేడు దీనిపై హైకోర్టులో విచారణ జరగనుంది.

వృద్ధులకు కొవిడ్ టీకా నిరాకరించడంపై హైకోర్టులో విచారణ
వృద్ధులకు కొవిడ్ టీకా నిరాకరించడంపై హైకోర్టులో విచారణ

By

Published : Jun 10, 2021, 3:38 AM IST

ఆధార్ కార్డులు లేని వృద్ధులకు కొవిడ్ టీకా నిరాకరించడంపై ఈనెల 8 న ' ఈనాడు ' ప్రధాన పత్రికలో ప్రచురితమైన 'ఆధార్ లేదు .. టీకా అందదు ' కథనాన్ని హైకోర్టు దృష్టికి తీసుకొస్తూ.. ఏపీ పౌరహక్కుల అసోసియేషన్ సంయుక్త కార్యదర్శి బి.మోహన్ రావు మెమో దాఖలు చేశారు. వృద్ధాశ్రమాల్లో వ్యాక్సిన్ వేయడానికి వెళ్లిన వైద్య సిబ్బంది.. ఆధార్ కార్డులు లేవన్న కారణంతో ఏయే వృద్ధాశ్రమాల్లో టీకా వేయలేదో కథనంలో పేర్కొన్నారని తెలిపారు. ఈ కారణంగా టీకా నిరాకరించడానికి వీల్లేదని కేంద్ర ప్రభుత్వం మార్గదర్శకాలు, సుప్రీకంకోర్టు ఉత్తర్వులు జారీ చేసిందన్నారు. కేంద్ర మార్గదర్శకాల ప్రకారం గుర్తింపు కార్డులు లేని వృద్ధాశ్రమాలు, పునరావాస కేంద్రాలు, జైళ్లలో ఉండే వారితో పాటు అస్థిరవాసులను జిల్లా టాస్క్ ఫోర్స్ గుర్తించాల్సి ఉందన్నారు. కీ ఫెసిలిటేటర్ సారధ్యంలో వారందరికి టీకా ఇవ్వాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందన్నారు. ఈ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం జారీచేసిన మార్గదర్శకాలను అమలు చేసేలా రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించాలని కోరారు. కరోనా కట్టడికి ప్రభుత్వం చర్యలు చేపట్టేలా ఆదేశించాలని కోరుతూ ఏపీసీఎల్ సంయుక్త కార్యదర్శి బి.మోహన్ రావు హైకోర్టులో ఇప్పటికే పిల్ వేశారు. ఈ వ్యాజ్యంతో పాటు కొవిడ్ అంశంపై దాఖలైన పలు వ్యాజ్యాలపై నేడు హైకోర్టు విచారణ జరపనుంది.

ABOUT THE AUTHOR

...view details