సామాజిక మాధ్యమాల్లో న్యాయమూర్తులను దూషించిన కేసుపై హైకోర్టు విచారణ జరిపింది. సోషల్ మీడియాలో పోస్టుల జియో సీలింగ్ పై హైకోర్ట్ స్టాండింగ్ కౌన్సిల్ అశ్వనీ కుమార్ అఫిడవిట్ దాఖలు చేశారు. ప్రపంచ వ్యాప్తంగా న్యాయమూర్తులపై దూషిస్తూ పెట్టిన పోస్టులను ఎలా కంట్రోల్ చేశారో అశ్వనీ కుమార్ అఫిడవిట్లో పేర్కొన్నారు. ఈ అఫిడవిట్‌ను అధ్యయనం చేసేందుకు తమకు సమయం కావాలని సోషల్ మీడియా సంస్థల న్యాయవాదులు కోరారు. వారి అభ్యర్థనను పరిగణలోకి తీసుకున్న న్యాయస్థానం తదుపరి విచారణను ఏప్రిల్ 20కి వాయిదా వేసింది.
HC ON SOCIAL MEDIA: జడ్జిలపై పోస్టుల కేసులో... అశ్వనీ కుమార్ అఫిడవిట్ దాఖలు
న్యాయమూర్తులను దూషిస్తూ సామాజిక మాధ్యమాల్లో పోస్టుల పెట్టిన కేసుపై హైకోర్టు విచారణ జరిపింది. ప్రపంచ వ్యాప్తంగా న్యాయమూర్తులపై దూషిస్తూ పెట్టిన పోస్టులను ఎలా కంట్రోల్ చేశారో తెలుపుతూ.. అశ్వనీ కుమార్ అఫిడవిట్ దాఖలు చేశారు. ఈ అఫిడవిట్‌ను అధ్యయనం చేసేందుకు సామాజిక సంస్థలు సమయం కోరగా... హైకోర్టు అందుకు అంగీకరించింది.
హైకోర్టు