ఆంధ్రప్రదేశ్

andhra pradesh

By

Published : Feb 16, 2022, 4:01 AM IST

Updated : Feb 16, 2022, 5:23 AM IST

ETV Bharat / city

HC ON SCHOOLS: ఫీజుల వసూలును నిలువరించడం సరికాదు: హైకోర్టు

వివరాలు సమర్పించడంలో విఫలమైన ప్రైవేటు పాఠశాలలు, కళాశాలల యాజమాన్యాలు విద్యార్థుల నుంచి రుసుములు వసూలు చేయడానికి అనుమతించం అంటూ ఏపీ పాఠశాల విద్య నియంత్రణ, పర్యవేక్షణ కమిషన్ నోటిఫికేషన్లో పేర్కొనడాన్ని హైకోర్టు తప్పుపట్టింది. నోటిఫికేషన్లోని ఆ భాగం అమలును నిలుపుదల చేసింది.

హైకోర్టు
హైకోర్టు

అడిగిన వివరాలు సమర్పించడంలో విఫలమైన ప్రైవేటు పాఠశాలలు, కళాశాలల యాజమాన్యాలు విద్యార్థుల నుంచి రుసుములు వసూలు చేయడానికి అనుమతించమంటూ పాఠశాల విద్య నియంత్రణ, పర్యవేక్షణ కమిషన్ నోటిఫికేషన్లో పేర్కొనడాన్ని హైకోర్టు తప్పుపట్టింది . నోటిఫికేషన్లోని ఆ భాగం అమలును నిలుపుదల చేసింది. రుసుములు వసూలును నిలువరించే అధికారం కమిషన్ కు ఉండదని స్పష్టం చేసింది. మరోవైపు కమిషన్ కోరిన పూర్తి సమాచారాన్ని విద్యా సంస్థలు అందజేయాల్సిందేనని తేల్చిచెప్పింది. తదుపరి విచారణను మార్చి 8 కి వాయిదా వేసింది. హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ప్రశాంతకుమార్ మిశ్ర , జస్టిస్ ఎస్. సుబ్బారెడ్డితో కూడిన ధర్మాసనం ఈ మేరకు ఆదేశాలిచ్చింది.

Last Updated : Feb 16, 2022, 5:23 AM IST

ABOUT THE AUTHOR

...view details