high court on prc petitions : వేతన సవరణ విషయంలో ప్రభుత్వ ఉత్తర్వులను సవాలు చేస్తూ దాఖలైన వ్యాఖ్యంపై అత్యవసర విచారణ జరపాలని న్యాయవాది రవితేజ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ప్రశాంతకుమార్ మిశ్ర నేతృత్వంలోని ధర్వాసనాన్ని అభ్యర్థించారు. దీనిపై సీజే స్పందిస్తూ .. ఇంకా సంబంధిత ఫైల్ తన వద్దకు రాలేదన్నారు. హైకోర్టు రిజిస్ట్రీ తన ముందు ఉంచాక పరిపాలనపరమైన నిర్ణయం తీసుకుంటానని తెలిపారు. ఈనెల 17న రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన పిఆర్సీ ఉత్తర్వులను సవాలు చేస్తూ ఏపీ గెజిటెడ్ అధికారుల ఐకాస ఛైర్మన్ కేవీ కృష్ణయ్య హైకోర్టులో వ్యాజ్యం వేశారు. ఏ బెంచ్ ముందుకు ఈ వ్యాజ్యం విచారణకు వెళ్లాలో పరిపానలపరమైన నిర్ణయం తీసుకునేందుకు ఫైలు సీజే వద్ద ఉంచాలని జస్టిస్ అననుద్దీన్ అమానుల్లా నేతృత్వంలోని ధర్మాసనం హైకోర్టు రిజిస్ట్రీని ఆదేశించింది.
ఫైల్ వచ్చాక.. పరిపాలనపరమైన నిర్ణయం తీసుకుంటాం: హైకోర్టు - ఏపీ వార్తలు
high court on prc petitions : పీఆర్సీ విషయంలో ప్రభుత్వ ఉత్తర్వులను సవాలు చేస్తూ దాఖలైన అత్యవసర విచారణ జరపాలని న్యాయవాది రవితేజ ..ధర్వాసనాన్ని అభ్యర్థించారు. స్పందించిన సీజే.. ఇంకా సంబంధిత ఫైల్ తన వద్దకు రాలేదన్నారు. హైకోర్టు రిజిస్ట్రీ తన ముందు ఉంచాక పరిపాలనపరమైన నిర్ణయం తీసుకుంటానని తెలిపారు.
high court