ఆంధ్రప్రదేశ్

andhra pradesh

By

Published : Dec 20, 2019, 7:09 PM IST

ETV Bharat / city

'నాలుగు వారాల్లో పీపీఏ బకాయిలు చెల్లించండి'

ప్రభుత్వం.. తమకు చెల్లించాల్సిన పాత బకాయిలపై పీపీఏ కంపెనీలు హైకోర్టులో దాఖలు చేసిన పిటిషన్​పై ధర్మాసనం విచారణ చేపట్టింది. పిటిషనర్ తరఫు న్యాయవాది వాదనలు విన్న హైకోర్టు.. నాలుగు వారాల్లో పాతబకాయిలు రూ.1400 కోట్లు చెల్లించాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది.

High court on ppa
పీపీఏ పాతబకాయిలపై హైకోర్టు ఆదేశాలు


పీపీఏ(విద్యుత్ కొనుగోలు ఒప్పందాలు) పాత బకాయిలు చెల్లించేలా ప్రభుత్వాన్ని ఆదేశించాలంటూ సౌర, పవన విద్యుత్ కంపెనీలు హైకోర్టులో దాఖలు చేసిన పిటిషన్​పై ధర్మాసనం విచారణ చేపట్టింది. 18 నెలలుగా తమకు బకాయిలు చెల్లించలేదని, కంపెనీల నిర్వహణ భారమవుతోందని పీపీఏ కంపెనీల తరపు న్యాయవాది కోర్టు దృష్టికి తెచ్చారు. తమ సంస్థల నుంచి పూర్తి స్థాయిలో విద్యుత్​ కొనుగోలు చేయటం లేదని న్యాయస్థానానికి తెలిపారు. పీపీఏ బకాయిలను చెల్లించాలని, విద్యుత్ కొనుగోలు కొనసాగించాలని సింగిల్ జడ్జి గతంలో ఇచ్చిన ఆదేశాలను ప్రభుత్వం అమలుపరచలేదని పేర్కొన్నారు. తమ ఆదేశాలు పాటించకపోవడంపై ప్రభుత్వంపై హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. పాతబకాయిలు రూ. 1400 కోట్లు నాలుగు వారాల్లో కంపెనీలకు చెల్లించాలని మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది.

ABOUT THE AUTHOR

...view details