'బకాయిలు ఎందుకు చెల్లించలేదో వివరణ ఇవ్వండి' - HC_On_PPA_Companies latest
ఏపీఎస్పీడీసీఎల్ సీజీఎం సంతోషరావుపై హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. పవన, సౌర విద్యుత్ ఉత్పత్తి సంస్థలకు 4 వారాల్లో బకాయిలు చెల్లిస్తామని కోర్టుకు హామీ ఇచ్చి ఎందుకు చెల్లించలేదో వివరణ ఇవ్వాలని ఆదేశించింది.
పవన, సౌర విద్యుత్ ఉత్పత్తి సంస్థలకు 4 వారాల్లో బకాయిలు చెల్లిస్తామని కోర్టుకు హామీ ఇచ్చి ఎందుకు చెల్లించలేదో వివరణ ఇవ్వాలని... ఏపీఎస్పీడీసీఎల్ సీజీఎం సంతోషరావును హైకోర్టు ఆదేశించింది. తదుపరి విచారణను ఈనెల 19కు వాయిదా వేసింది. తాత్కాలిక చర్యల్లో భాగంగా పవన విద్యుత్ యూనిట్‌కు 2 రూపాయల 43 పైసలు, సౌర విద్యుత్ యూనిట్‌కు 2 రూపాయల 44 పైసలు చొప్పున బకాయిలు చెల్లించాలని సింగిల్ జడ్జి ఆదేశించినా.. ప్రభుత్వం చెల్లించలేదని విద్యుత్ ఉత్పత్తి సంస్థలు గతంలో హైకోర్టు దృష్టికి తీసుకొచ్చాయి. బకాయిలు ఎప్పటిలోగా చెల్లిస్తారని ధర్మాసనం నిలదీయడంతో 4 వారాల్లోగా చెల్లిస్తామని గత డిసెంబర్‌లో సీజీఎమ్ హైకోర్టుకు ప్రమాణ పత్రం దాఖలు చేశారు. గతంలో ఇచ్చిన హామీ మేరకు బకాయిలు చెల్లించలేదని విద్యుత్ ఉత్పత్తి సంస్థల తరపు న్యాయవాదులు ధర్మాసనం దృష్టికి తీసుకొచ్చారు. ఆగ్రహం వ్యక్తం చేసిన కోర్టు సీజీఎమ్ ను వివిరణ కోరింది.