ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

బడ్జెట్ ప్రతి ఆధారంగా పిల్ ఎలా దాఖలు చేస్తారు? - petition

పాస్టర్లు, ఇమామ్​లు, మౌజామ్​లకు పారితోషకం విషయంలో తూర్పు గోదావరి జిల్లాకు చెందిన ఓ వ్యక్తి... హైకోర్టులో ప్రజాహిత వ్యాజ్యం దాఖలు చేశాడు. బడ్జెట్ ప్రసంగ ప్రతి ఆధారంగా పిల్ దాఖలు చేసినట్లు పిటిషనర్ తరపు న్యాయవాది తెలుపగా... కేవలం ప్రతి ఆధారంగా పిల్ ఎలా దాఖలు చేస్తారని న్యాయస్థానం ప్రశ్నించింది.

కేవలం బడ్జెట్ ప్రతి ఆధారంగా పిల్ ఎలా దాఖలు చేస్తారు?

By

Published : Aug 6, 2019, 9:57 AM IST

కేవలం బడ్జెట్ ప్రతి ఆధారంగా పిల్ ఎలా దాఖలు చేస్తారు?

పాస్టర్లు , ఇమామ్​లు, మౌజామ్ లకు పారితోషకం ఇచ్చే నిమిత్తం... రాష్ట్ర బడ్జెట్లో నిధులు కేటాయిస్తున్నట్లు ప్రభుత్వం చెప్పడం సరికాదంటూ... హైకోర్టులో ప్రజాహిత వ్యాజ్యం దాఖలైంది. తూర్పు గోదావరి జిల్లాకు చెందిన రామబొట్ల శ్రీనివాస సుదీష్ అనే వ్యక్తి ఈ వ్యాజ్యాన్ని దాఖలు చేయగా.... పిటిషనర్ తరపున న్యాయవాది ఉమేశ్ చంద్ర వాదనలు వినిపించారు. లౌకిక ప్రభుత్వాలు... మత ప్రాతిపదికన నిధులు కేటాయించడానికి వీల్లేదన్నారు. పారితోషకాల చెల్లింపు అంశం వక్ఫ్ బోర్డు వ్యవహారమని... ఈ విషయంలో ప్రభుత్వానికి బాధ్యత లేదని గతంలో సుప్రీంకోర్టు చెప్పిందని గుర్తు చేశారు. వాదనలపై ధర్మాసనం స్పందిస్తూ.. పారితోషకం చెల్లించేందుకు నిధులు కేటాయించినట్లు మీవద్ద ఏమైనా ధృవీకరణ ఉందా.. అని ప్రశ్నించింది. న్యాయవాది బదులిస్తూ బడ్జెట్ ప్రసంగ ప్రతిలో ఉందన్నారు. కేవలం ప్రతి ఆధారంగా పిల్ ఎలా దాఖలు చేస్తారని ధర్మాసనం పేర్కొంది. పూర్తి వివరాలు లేకుండా తొందరపడి వ్యాజ్యం దాఖలు చేయటం ఎందుకని ప్రశ్నించింది.

ABOUT THE AUTHOR

...view details