ఉపాధి పనులపై ఎలాంటి విచారణ జరగడం లేదని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఆదిత్యనాథ్ దాస్(CS ADITYANATH DAS AT COURT) హైకోర్టుకు నివేదించారు. కోర్టుకు వాస్తవం చెప్పారని వ్యాఖ్యానించిన న్యాయమూర్తి.. సీఎస్ చెప్పిన విషయాన్ని నమోదు చేశారు. కేంద్ర ప్రభుత్వాన్ని అదనపు వివరాలతో అఫిడవిట్ దాఖలు చేయాలని ఆదేశిస్తూ విచారణను ఈ నెల 29 కి వాయిదా వేశారు. మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం కింద గత ప్రభుత్వ హయాంలో చేసిన పనులకు రాష్ట్ర ప్రభుత్వం బిల్లులు చెల్లించకపోవడాన్ని సవాలు చేస్తూ దాఖలైన సుమారు 500 వ్యాజ్యాలపై హైకోర్టు విచారణ జరుపుతోంది. గత విచారణలో పంచాయతీరాజ్ శాఖ ముఖ్య కార్యదర్శి కోర్టులో అఫిడవిట్ దాఖలు చేస్తూ.. ఉపాధి పనులపై విజిలెన్స్ విచారణ జరుగుతున్న నేపథ్యంలో 21 శాతం సొమ్ము చెల్లించలేదని నివేదించారు.
CS TO HC: ఉపాధి పనులపై విచారణ జరగడం లేదు: ఆదిత్యనాథ్ దాస్
ఉపాధి పనులపై ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఆదిత్యనాథ్ దాస్ హైకోర్టుకు వివరణ ఇచ్చారు. బిల్లుల చెల్లింపుల నిలిపివేతకు సంబంధించి నమోదైన వ్యాజ్యాలపై కోర్టు విచారణ జరుపుతోంది.
CS TO HC