ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

HC: 'అరెస్ట్​ చేసే క్రమంలో సుప్రీంకోర్టు నిబంధనలు పాటించాలి' - hc On Kuna Ravikumar Petition

HC On Kuna Ravikumar Petition: తనను పోలీసులు నిబంధనలకు విరుద్ధంగా అరెస్టు చేశారని తెదేపా నేత కూన రవికుమార్ దాఖలు చేసిన పిటిషన్​పై హైకోర్టు విచారణ జరిపింది. అరెస్ట్ చేసేందుకు వెళ్లిన డీఎస్పీ, పోలీసులకు హైకోర్టు నోటీసులిచ్చింది.

High Court On Kuna Ravikumar Petition
ఏపీ హైకోర్టు

By

Published : Feb 12, 2022, 5:41 AM IST

HC On Kuna Ravikumar Petition: తనను పోలీసులు నిబంధనలకు విరుద్ధంగా అరెస్టు చేశారంటూ.. తెదేపా నేత కూన రవికుమార్ దాఖలుచేసిన పిటీషన్​పై హైకోర్టు విచారణ జరిపింది. రవికుమార్​ను అరెస్ట్ చేసేందుకు వెళ్లిన డీఎస్పీ, ఇతర పోలీసులకు నోటీసు ఇచ్చింది. పూర్తి వివరాలతో కౌంటర్ దాఖలు చేయాలని ఆదేశించింది. అరెస్టు చేసే క్రమంలో సుప్రీంకోర్టు నిబంధనలను పాటించాలని న్యాయస్థానం ఆదేశించింది. తదుపరి విచారణను వాయిదా వేసింది. పోలీసులను దూషించారనే ఆరోపణతో గతేడాది నవంబర్ 21న కూన రవికుమార్​ను పోలీసులు అరెస్టు చేశారు.

ABOUT THE AUTHOR

...view details