ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

ఎమ్మార్ ఈడీ కేసు: తదుపరి ఉత్తర్వులిచ్చే వరకు విచారణ ప్రక్రియపై స్టే - mr ed case latest news

ఎమ్మార్ ఈడీ కేసులో కోనేరు ప్రదీప్ క్వాష్ పిటిషన్‌పై విచారణ జరిపిన తెలంగాణ హైకోర్టు.. ఈనెల 30కి వాయిదా వేసింది.

Koneru Pradeep Quash petition
ఎమ్మార్ ఈడీ కేసులో క్వాష్ పిటిషన్‌పై విచారణ

By

Published : Jul 9, 2021, 5:03 PM IST

Updated : Jul 9, 2021, 6:08 PM IST

ఎమ్మార్‌ వ్యవహారంలో మనీలాండరింగ్‌ నిరోధక చట్టం కింద ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ (ఈడీ) కేసులో కోనేరు ప్రదీప్ వేసిన క్వాష్ పిటిషన్‌పై తెలంగాణ హైకోర్టు విచారణ జరిపింది. సోదరుడు కోనేరు మధుపై కేసు తొలగించడాన్ని ప్రదీప్ తరఫు న్యాయవాది కోర్టు దృష్టికి తెచ్చారు. మధుపై విచారణ నిలిపివేయడాన్ని సుప్రీంకోర్టులో సవాల్ చేస్తామని ఈడీ పేర్కొంది. వాదనల అనంతరం క్వాష్ పిటిషన్‌పై విచారణ ఈనెల 30కి వాయిదా వేసింది.

ఎమ్మార్‌ వ్యవహారంలో ఈడీ నమోదు చేసిన కేసును కొట్టివేయాలని కోరుతూ కోనేరు మధు దాఖలు చేసిన పిటిషన్‌పై శుక్రవారం జస్టిస్‌ జి.శ్రీదేవి విచారణ చేపట్టారు. వాదనలు విన్న ధర్మాసనం కోనేరు మధుపై ఈడీ కేసు విచారణను నిలిపివేస్తూ గతంలో ఇచ్చిన ఉత్తర్వులను పొడిగించింది. తదుపరి ఉత్తర్వులు జారీ చేసేదాకా విచారణ ప్రక్రియపై స్టే మంజూరు చేసింది.

Last Updated : Jul 9, 2021, 6:08 PM IST

ABOUT THE AUTHOR

...view details