జడ్జి రామకృష్ణ అరెస్టు విషయంలో సుప్రీంకోర్టు మార్గదర్శకాలను పాటించారా? లేదా? అనే విషయాన్ని తేలుస్తామని హైకోర్టు స్పష్టంచేసింది. చిత్తూరు జిల్లా జైలు నుంచి పీలేరు సబ్ జైలుకు జడ్జి రామకృష్ణను మార్చామని, బెయిలు పొంది ప్రస్తుతం ఉపశమనం పొందారని హోంశాఖ తరఫున ప్రభుత్వ న్యాయవాది(జీపీ) మహేశ్వరరెడ్డి కోర్టుకు తెలిపారు. జడ్జి రామకృష్ణ ప్రస్తుతం సస్పెన్షన్‌లో ఉన్నారని, విధి నిర్వహణలో ఉన్నవారికే సుప్రీంకోర్టు మార్గదర్శకాలు వర్తిస్తాయన్నారు. వ్యాజ్యంపై విచారణను మూసేయాలని కోరారు. ఆ విషయాలు తమకు చెప్పొద్దని, అరెస్టు విషయంలో నిబంధనలు పాటించారా? లేదా? అనే విషయాన్ని ఈ వ్యాజ్యంలో తేలుస్తామని హైకోర్టు వ్యాఖ్యానించింది. సంబంధిత జిల్లా జడ్జికి, హైకోర్టుకు సమాచారం ఇవ్వకుండా న్యాయాధికారి రామకృష్ణను అరెస్టు చేసిన విషయమై సుమోటోగా కేసు నమోదు చేశామంది. కౌంటర్ దాఖలుకు సమయం కావాలని జీపీ కోరడంతో విచారణను జులై 28కి వాయిదా వేసింది. హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఏకే గోస్వామి, జస్టిస్ ఎన్.జయసూర్యతో కూడిన ధర్మాసనం శుక్రవారం ఈమేరకు ఆదేశాలిచ్చింది. సీఎం జగన్‌పై వ్యాఖ్యల విషయంలో... దేశద్రోహం కేసులో అరెస్టై చిత్తూరు జిల్లా జైలులో ఉన్న తన తండ్రి ప్రాణాలకు ముప్పు ఉందని పేర్కొంటూ జడ్జి ఎస్.రామకృష్ణ తనయుడు వంశీకృష్ణ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తికి లేఖ రాశారు. ఆ లేఖను హైకోర్టు సుమోటోగా పరిగణించిన విషయం తెలిసిందే.
High court: 'సుప్రీం' మార్గదర్శకాలు పాటించారా? అనేది తేలుస్తాం - జడ్జి రామకృష్ణ అరెస్టుపై హైకోర్టు కామెంట్స్
జడ్జి రామకృష్ణ అరెస్టు విషయంలో సుప్రీంకోర్టు మార్గదర్శకాలను పాటించారా? లేదా? అనే విషయాన్ని తేలుస్తామని హైకోర్టు స్పష్టంచేసింది. సంబంధిత జిల్లా జడ్జికి, హైకోర్టుకు సమాచారం ఇవ్వకుండా న్యాయాధికారి రామకృష్ణను అరెస్టు చేసిన విషయమై సుమోటోగా కేసు నమోదు చేశామంది.
high court on judge ramakrishna arrest