ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

మానవ హక్కుల కమిషన్ ఎప్పుడు ఏర్పాటు చేస్తారు?: హైకోర్టు - మానవ హక్కుల కమిషన్​పై హైకోర్టులో విచారణ వార్తలు

ఏపీలో మావన హక్కుల కమిషన్ ఎప్పటిలోగా ఏర్పాటు చేస్తారో చెప్పాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని హైకోర్టు ప్రశ్నించింది. వివరాల్ని కోర్టు ముందు ఉంచేందుకు పది రోజుల సమయం కావాలని.. అడ్వొకేట్ జనరల్ ఎస్.శ్రీరామ్ బదులిచ్చారు.

మానవ హక్కుల కమిషన్ ఎప్పుడు ఏర్పాటు చేస్తారు?: హైకోర్టు
మానవ హక్కుల కమిషన్ ఎప్పుడు ఏర్పాటు చేస్తారు?: హైకోర్టు

By

Published : Feb 2, 2021, 10:53 PM IST

మానవ హక్కుల కమిషన్ ఏర్పాటుపై ప్రభుత్వాన్ని హైకోర్టు ప్రశ్నించింది. అడ్వకేట్ జనరల్ ఎస్.శ్రీరామ్ బదులిస్తూ .. కమిషన్ ఏర్పాటు స్క్రీనింగ్ కమిటీలో ముఖ్యమంత్రి , ప్రతిపక్ష నాయకుడితో పాటు పలువురు ఉంటారన్నారు. ఆ కమిటీ ఎప్పుడు సమావేశం అవుతుంది. ఎప్పటిలోగా కమిషన్ ఏర్పాటును పూర్తి చేస్తుంది. తదితర విషయాల్ని ముఖ్యమంత్రితో చర్చించి.. ఆ వివరాలను కోర్టు ముందు ఉంచేందుకు పది రోజులు సమయం కావాలన్నారు. దరఖాస్తుల స్వీకరణ ప్రక్రియ ఇప్పటికే ప్రారంభించామన్నారు. ఆ వివరాల్ని పరిగణలోకి తీసుకున్న ధర్మాసనం .. హక్కుల కమిషన్​కు ఉన్న ప్రాధాన్యత మీకు తెలియంది కాదని.. ఏర్పాటుకు చర్యలు తీసుకోవాలని వ్యాఖ్యానించింది. విచారణను ఈనెల 15 కు వాయిదా వేసింది. హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఏకే గోస్వామి, జస్టిస్ సి.ప్రవీణ్ కుమార్​తో కూడిన ధర్మాసనం ఈ మేరకు ఆదేశాలిచ్చింది.

మావన హక్కుల కమిషన్ ఏర్పాటు కోసం ఏపీ పౌరహక్కుల అసోసియేషన్ సంయుక్త కార్యదర్శి బి.మోహనరావు గతంలో హైకోర్టులో పిల్ వేశారు. ఏజీ ఎస్.శ్రీరామ్ అప్పట్లో వాదనలు వినిపిస్తూ.. నాలుగు నెలల్లో మానవహక్కుల ఏర్పాటు చేస్తామన్నారు. ఆ వివరాల్ని పరిగణనలోకి తీసుకున్న ధర్మాసనం .. ఏజీ కోర్టుకు చెప్పిన గడువులోపు కమిషన్ ఏర్పాటుకు చర్యలు తీసుకోవాలని 2019 అక్టోబర్ 30న ఆదేశాలిచ్చింది. కోర్టు ఆదేశాల మేరకు కమిషన్ ను ఏర్పాటు చేయలేదని, బాధ్యులైన అధికారుల్ని శిక్షించాలని కోరుతూ బి.మోహనరావు గతేడాది జులైలో కోర్టు ధిక్కరణ వ్యాజ్యం దాఖలు చేశారు. అప్పటి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీలం సాహ్ని , హోంశాఖ ముఖ్యకార్యదర్శి కుమార్ విశ్వజిత్, సాధారణ పరిపాలన శాఖ సీఎస్ డాక్టర్ శ్రీకాంత్ నాగులపల్లిని వ్యాజ్యంలో ప్రతివాదులుగా పేర్కొన్నారు.

ఇదీ చదవండి:గూఢచారులు గుట్టుగా ఓటేయొచ్చు.. తెలుసా..?

ABOUT THE AUTHOR

...view details