మూలధన విలువ అధారిత ఆస్తి పన్ను(HOUSE TAX GO BY GOVERNMENT) విధించేందుకు వీలుగా తీసుకొచ్చిన మున్సిపల్ సవరణ చట్టం, జీవో నంబర్- 198 ను సవాలు చేస్తూ.. ట్యాక్స్ పేయర్స్ అసోసియేషన్ విజయవాడ కార్యదర్శి వీరాంజనేయులు దాఖలు చేసిన వ్యాజ్యంపై హైకోర్టు(HIGH COURT) విచారించింది. సీఎస్, పురపాలక, న్యాయశాఖల కార్యదర్శులు, కృష్ణా జిల్లా కలెక్టర్‌కు నోటీసులు జారీ చేసింది. ప్రభుత్వ నిర్ణయంతో ప్రజలపై అధిక భారం పడుతుందని పిటిషనర్ వాదించారు. ప్రజల నుంచి అభ్యంతరాల సేకరణ ప్రక్రియ సక్రమంగా నిర్వహించలేదన్నారు . ఆస్తి పన్నును సంపద సృష్టి పన్నుగా మార్చారన్నారు . జీవో అమలును నిలిపివేయాలని కోరారు. ఆస్తి పన్ను విధింపు విషయంలో కేంద్రం సిఫార్సుల మేరకే నిర్ణయం తీసుకున్నామని ప్రభుత్వం తరఫు న్యాయవాది వాదించారు. ఇరువురి వాదనలు విన్న ధర్మాసనం.. విచారణను ఎనిమిది వారాలకు వాయిదా వేసింది.
HC ON HOUSE TAX: మూలధన విలువ ఆధారిత ఆస్తి పన్ను జీవోపై విచారణ - కోర్టు వార్తలు
ఆస్తి పన్ను విధించేందుకు రాష్ట్ర ప్రభుత్వం తెచ్చిన జీవోపై వేసిన వ్యాజ్యాన్ని హైకోర్టు విచారించింది. తదుపరి విచారణను ధర్మాసనం 8 వారాలకు వాయిదా వేసింది.
మున్సిపల్ సవరణ చట్టం