సంక్రాంతి సందర్భంగా జరిగే కోడి పందేలను నిలువరించడానికి ఎలాంటి చర్యలు తీసుకున్నారు? అందుకు సంబంధించిన వివరాల్ని ఫోటోలతో సహా నివేదిక సమర్పించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది. నివేదిక ఆదారంగా... ఉల్లంఘనలకు పాల్పడ్డవారిపై చర్యలు తీసుకుంటామని పేర్కొంది. తదుపరి విచారణను ఫిబ్రవరి రెండో వారానికి వాయిదా వేసింది. హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ జేకే మహేశ్వరి, జస్టిస్ ఎం.వెంకటరమణలతో కూడిన ధర్మాసనం మంగళవారం ఈ మేరకు ఆదేశాలు జారీ చేసింది. సంక్రాంతి కోడిపందేలను నిలువరించేందుకు 2016 డిసెంబర్లో ఉన్నత న్యాయస్థానం ఇచ్చిన ఉత్తర్వులు అమలు చేయటంలో అధికారులు విఫలమయ్యారని పేర్కొంటూ 2018లో జీ మౌలేఖీ కోర్టు ధిక్కరణ వ్యాజ్యం దాఖలు చేశారు.
'కోడి పందేలను అడ్టుకోవడానికి తీసుకున్న చర్యలేంటి..?' - high court on hen compititions in ap
సంక్రాంతి కోడి పందేలను అడ్డుకోవటానికి ఎలాంటి చర్యలు తీసుకున్నారో తెలపాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని హైకోర్టు ప్రశ్నించింది. అందుకు సంబంధించిన వివరాలను.. ఆధారాలతో సహా నివేదిక సమర్పించాలని ఆదేశించింది.
కోడి పందేలను అడ్టుకోవడానికి తీసుకున్న చర్యలేంటి?