పోలీసులు పలువుర్ని అక్రమంగా నిర్బంధంలోకి తీసుకున్న ఘటనల్లో ఆ వ్యక్తుల్ని కోర్టులో హాజరుపరిచేలా ఆదేశాలు జారీచేయాలని అభ్యర్థిస్తూ దాఖలైన పలు హెబియస్ కార్పస్ పిటిషన్లపై హైకోర్టు విచారణ జరుపుతోంది. పోలీసుల తరఫున సీనియర్ కౌన్సెల్ వాదనలు వినిపించారు. తదుపరి విచారణను ఒకటి, రెండు రోజులు వాయిదా వేయాలని ఆయన కోరగా ధర్మాసనం నిరాకరించింది. రోజువారీ విచారణ జరుపుతున్న నేపథ్యంలో గడువు ఇవ్వలేమని తేల్చి చెప్పింది.
నిర్బంధ వ్యాజ్యాల విచారణ నేటికి వాయిదా - నిర్బంధ వ్యాజ్యాలపై హైకోర్టులో విచారణ వార్తలు
పోలీసుల నిర్బంధంలోకి తీసుకున్న వారిని కోర్టులో హాజరు పరచాలంటూ.. దాఖలైన పలు హెబియస్ కార్పస్ పిటిషన్లపై ప్రభుత్వ ప్రత్యేక సీనియర్ కౌన్సెల్ ఎస్.ఎస్ ప్రసాద్ మంగళవారం వాదనలు వినిపించారు. కొనసాగింపునకు విచారణ బుధవారానికి వాయిదా పడింది.
నిర్బంధ వ్యాజ్యాల విచారణ నేటికి వాయిదా
TAGGED:
పోలీసులపై హైకోర్టు కామెంట్స్