వ్యక్తులను అక్రమంగా నిర్బంధించడంపై హైకోర్టులో దాఖలైన హెబియస్ కార్పస్ పిటిషన్లపై విచారణ జరిపింది. పిటిషన్లపై సుప్రీంకోర్టుకు వెళ్లనున్నామని.. దానికి రెండు వారాల సమయం కావాలని ప్రభత్వం తరఫున ఏజీ... ధర్మాసనాన్ని కోరారు. సుప్రీంకోర్టుకు వెళ్లాలనుకుంటే వెళ్లండి.. కానీ రెండు వారాల సమయం ఇవ్వలేమని ధర్మాసనం తెలిపింది. తదుపరి విచారణను 16వ తేదీకి వాయిదా వేసింది.
సుప్రీంకోర్టుకు వెళ్లాలనుకుంటే వెళ్లండి.. కానీ సమయం ఇవ్వలేం: హైకోర్టు - వ్యక్తుల అక్రమ నిర్బంధంపై హైకోర్టులో పిటిషన్ వార్తలు
వ్యక్తులను అక్రమంగా నిర్బంధించారంటూ హైకోర్టులో దాఖలైన పలు హెబియస్ కార్పస్ పిటిషన్లపై విచారణ జరిగింది. తదుపరి విచారణను 16వ తేదీకి వాయిదా వేసింది.
high court on habeas corpus petition