hc on guntur nri hospital issue : గుంటూరు జిల్లా మంగళగిరి మండలం చినకాకాని వద్ద ఉన్న ఎన్ఆర్ఐ ఆసుపత్రి కార్యనిర్వహణ కమిటీ విషయంలో రెండు వర్గాల మధ్య ఏర్పడిన వివాదాన్ని ' ఆర్బిట్రేటర్ వద్ద పరిష్కరించుకోవాలని హైకోర్టు స్పష్టంచేసింది. ఇందులో తాము జోక్యం చేసుకోవడం సరికాదంది. ఆర్బిట్రేటర్‌గా నియమించేందకు హైకోర్టు విశ్రాంత ప్రధాన న్యాయమూర్తి పేర్లతో జాబితాను తమ ముందు ఉంచాలని ఇరువైపు న్యాయవాదులను ఆదేశించింది. విచారణను మంగళవారానికి వాయిదా వేసింది. హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ప్రశాంత్ కుమార్ మిశ్ర , జస్టిస్ ఎం.సత్యనారాయణమూర్తితో కూడిన ధర్మాసనం ఈ మేరకు ఆదేశాలిచ్చింది.
ఆ వివాదంలో జోక్యం చేసుకోవడటం సరికాదు: హైకోర్టు - గుంటూరు జిల్లాలో ఎన్ఆర్ఐ ఆసుపత్రి
hc on guntur nri hospital issue : గుంటూరు జిల్లాలో ఎన్ఆర్ఐ ఆసుపత్రి కార్యనిర్వహణ కమిటీ విషయంలో రెండు వర్గాల మధ్య ఏర్పడిన వివాదాన్ని ఆర్బిట్రేటర్ వద్ద పరిష్కరించుకోవాలని హైకోర్టు స్పష్టంచేసింది. ఈ వివాదంలో తాము జోక్యం చేసుకోవడం సరికాదంది. ఆర్బిట్రేటర్‌గా నియమించేందకు హైకోర్టు విశ్రాంత ప్రధాన న్యాయమూర్తి పేర్లతో జాబితాను తమ ముందు ఉంచాలని ఆదేశించింది.
ఎన్ఆర్ఐ అకాడమీ ఆఫ్ సైన్సెస్ కార్యనిర్వహణ కమిటీ సభ్యుల ఎంపిక విషయంలో గతేడాది జూన్ 24 న జరిగిన సమావేశంలోని అంశాలను ఆమోదించి వాటిని నమోదు చేయడానికి సొసైటీ రిజిస్ట్రార్ నిరాకరించడాన్ని సవాలు చేస్తూ ..డాక్టర్ రాఘవరావు , డాక్టర్ ఎన్.ఉపేంద్రనాథ్ , డాక్టర్ అక్కినేని మణి హైకోర్టులో వ్యాజ్యం వేశారు. ఈ వ్యవహారంపై విచారణ జరిపిన హైకోర్టు ఎన్ఆర్ఐకి సంబంధించి అర్బిట్రేషన్ చట్ట పరిధిలో పరిష్కరించుకునే అన్ని వివాదాలను ఆర్బిట్రేటర్ వద్ద పరిష్కరించుకోవాలని ఇరుపక్షాలకు సూచించింది.
ఇదీ చదవండి :ప్రత్యక్షంగా చేయలేని దానిని... పరోక్షంగా చేస్తున్నారు