రాష్ట్ర ఎన్నికల కమిషనర్ పదవీ కాలన్ని కుదిస్తూ ఏపీ ప్రభుత్వం ఆర్డినెన్స్, జీవోలను తీసుకొచ్చిన విషయం తెలిసిందే. అనంతరం మద్రాస్ హైకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ కనగరాజును ఎస్‌ఈసీగా రాష్ట్ర ప్రభుత్వం నియమించడంతో ఆయన శనివారం బాధ్యతలు స్వీకరించారు.
ఎస్‌ఈసీ పదవీ కాలం కుదింపుపై హైకోర్టు విచారణ
ఎస్‌ఈసీ పదవీ కాలం కుదిస్తూ ఆర్డినెన్స్, జీవోల జారీపై హైకోర్టులో 6 పిటిషన్లు దాఖలయ్యాయి. పిటిషన్లపై ధర్మాసనం వీడియో కాన్ఫరెన్స్ ద్వారా విచారణ జరిపింది. ఈ నెల 16 కల్లా ప్రమాణపత్రం దాఖలు చేయాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. తదుపరి విచారణను ఈ నెల 20కి వాయిదా వేసింది.
high-court-on-govt-decision