మార్చి, ఏప్రిల్‌కు ఒకే బిల్లు ఇవ్వడం నిబంధనలకు వ్యతిరేకమన్న పిల్‌పై ఇవాళ.. ధర్మాసనం విచారణ చేసింది. డిపార్టుమెంట్ ఆఫ్ ఎనర్జీ, ఏపీ ప్రభుత్వం, ఏపీ ట్రాన్స్‌కో, ఏపీ జెన్‌కో, ఏపీఎస్పీడీసీఎల్ కౌంటర్ దాఖలు చేయాలని ఆదేశించింది. ఏబీసీ టారిఫ్ యూనిట్లలో పలు మార్పులు చేశారని పిటిషనర్ తరఫు న్యాయవాది వాదనలు వినిపించారు. ఇళ్లకు వచ్చే బిల్లులు విపరీతంగా పెరిగాయని వాదనలు కోర్టుకు తెలిపారు. కొత్త నిబంధనలు ఏప్రిల్ 1 నుంచి రావాలని.. నిబంధనల ప్రకారం నెలకు ఒకసారి విద్యుత్ బిల్లు ఇవ్వాలని పిటిషన్ తరఫు న్యాయవాది కోరారు. పిల్‌కు విచారణార్హత లేదని ప్రభుత్వ తరఫు న్యాయవాది మెట్టా చంద్రశేఖర్‌రావు వాదనలు వినిపించారు.
విద్యుత్ బిల్లులపై 3 వారాల్లోపు కౌంటర్ దాఖలు చేయాలి - విద్యుత్ బిల్లులపై కౌంటర్ దాఖలు చేయాలన్న హైకోర్టు న్యూస్
రాష్ట్రంలో విద్యుత్ బిల్లుల అంశంపై హైకోర్టులో విచారణ జరిగింది. మూడు వారాల్లోపు కౌంటర్ దాఖలు చేయాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది.

high court on electricity bills