ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

high court : 'ఆ సొమ్మును మినహాయించటం న్యాయమే' - హైకోర్టు వార్తలు

ఓ జాయింట్ వెంచర్ సంస్థకు చెల్లించాల్సిన బిల్లుల నుంచి జిల్లా ఖనిజ నిధి కింద , రాష్ట్ర ఖనిజాన్వేషణ ట్రస్ట్ కింద కొంత సొమ్మును మినహాయించడాన్ని హైకోర్టు సమర్థించింది. జిల్లా ఖనిజ నిధి , ఖనిజాన్వేషణ కోసం మినహాయించిన సొమ్ము ' సహాయం / తోడ్పాటు ' కిందకు వస్తుందని స్పష్టంచేసింది. అనంతరం వ్యాజ్యాన్ని కొట్టేసింది.

high court
high court

By

Published : Mar 31, 2022, 4:53 AM IST

ఓ జాయింట్ వెంచర్ సంస్థకు చెల్లించాల్సిన బిల్లుల నుంచి జిల్లా ఖనిజ నిధి కింద 300 శాతం , రాష్ట్ర ఖనిజాన్వేషణ ట్రస్ట్ కింద 2 శాతం సొమ్మును మినహాయించడాన్ని హైకోర్టు సమర్థించింది. గనుల తవ్వక ప్రాంతంలో ప్రభావితమైన ప్రజల సంక్షేమం కోసం జిల్లా ఖనిజ నిధి ఏర్పాటు చేశారని గుర్తుచేసింది. ఈ నేపథ్యంలో జిల్లా ఖనిజ నిధి , ఖనిజాన్వేషణ కోసం మినహాయించిన సొమ్ము ' సహాయం / తోడ్పాటు ' కిందకు వస్తుందని స్పష్టంచేసింది. మినహాయించిన సొమ్మును అదనపు సీనరేజ్ చార్జిలుగా పరిగణించడానికి వీల్లేదని తెలిపింది. అనంతరం వ్యాజ్యాన్ని కొట్టేసింది. హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ డీవీఎన్ఎన్ సోమయాజులు ఇటీవల ఈమేరకు తీర్పు ఇచ్చారు.

కాంట్రాక్ట్ పనులు నిర్వహించాక తమకు రావాల్సిన బిల్లుల్లోంచి రైల్వేశాఖ .. జిల్లా ఖనిజ నిధి , ఖనిజాన్వేషణ ట్రస్ట్ కోసం 32 శాతం సొమ్మును మినహాయించడాన్ని సవాలు చేస్తూ కేసీఆర్ ఈసీసీఎల్ - ఈఆర్పి ఇన్ఫ్రా టెక్ జాయింట్ వెంచర్ సంస్థ 2017లో హైకోర్టును ఆశ్రయించింది. జిల్లా మినరల్ ఫౌండేషన్ కోసం చెల్లించేది ప్రత్యేక ఛార్జిలని రైల్వే శాఖ తరపు న్యాయవాది కె.అరుణ వాదనలు వినిపించారు. వాటిని గుత్తేదారు చెల్లించాలన్నారు. ఆ వాదనలను పరిగణనలోకి తీసుకున్న న్యాయమూర్తి పిటిషనర్ సంస్థ విషయంలో విధించినది కొత్త రుసుము కాదన్నారు. టెండర్ నోటిఫికేషన్ తర్వాత విధించింది కాదన్నారు. చట్ట సవరణ అమల్లోకి వచ్చిన 2015 జనవరి 12 నుంచి ఆ సొమ్మును పనూలు చేస్తున్నారన్నారని గుర్తుచేశారు.

ఇదీ చదవండి: High Court News: ఎన్‌సీటీఈ ఉత్తర్వులు కొట్టివేస్తూ.. హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు

ABOUT THE AUTHOR

...view details