ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

న్యాయవాదులకు కరోనా పరీక్షలు.. హైకోర్టుకు విధివిధానాల సమర్పణ - న్యాయవాదులకు కరోనా పరీక్షలు

రాష్ట్రంలోని న్యాయవాదులు, వారి కుటుంబ సభ్యులు, గుమస్తాలకు కరోనా పరీక్షలు, చికిత్స అందించే విషయంలో విధివిధానాలను అడ్వకేట్ జనరల్ (ఏజీ) ఎస్. శ్రీరామ్ హైకోర్టుకు సమర్పించారు. వైద్య ఆరోగ్యశాఖ ముఖ్య కార్యదర్శి జిల్లాకు ఒక నోడల్ అధికారిని నియమించాలని విధివిధానాల్లో పేర్కొన్నారు. హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ జేకే మహేశ్వరి నేతృత్వంలోని ధర్మాసనం వివరాలను పరిశీలించేందుకు విచారణను సోమవారానికి వాయిదా వేసింది.

high court on corona test to lawyers
న్యాయవాదులకు కరోనా పరీక్షలు.. హైకోర్టుకు విధివిధానాల సమర్పణ

By

Published : Jul 31, 2020, 10:08 AM IST

రాష్ట్రంలోని న్యాయవాదులు, వారి కుటుంబ సభ్యులు, గుమస్తాలకు కరోనా పరీక్షలు, చికిత్స అందించే విషయంలో విధివిధానాలను అడ్వకేట్ జనరల్ (ఏజీ) ఎస్. శ్రీరామ్ హైకోర్టుకు సమర్పించారు. వైద్య ఆరోగ్యశాఖ ముఖ్య కార్యదర్శి జిల్లాకు ఒక నోడల్ అధికారిని నియమించాలని విధివిధానాల్లో పేర్కొన్నారు. జిల్లాలోని న్యాయవాదుల సంఘాలతో నోడల్ అధికారి.. న్యాయవాదులు, కుటుంబ సభ్యులు, గుమస్తాలకు కరోనా పరీక్షలు నిర్వహించే విషయంలో సమన్వయం చేసుకుంటారన్నారు. ప్రతి జిల్లాలోని న్యాయవాదుల సంఘం అధ్యక్షుడు... నోడల్ అధికారితో సమన్వయం చేసుకునేందుకు ఇద్దరు న్యాయవాదులను నియమిస్తారని, వారి ఫోన్ నంబర్లు జిల్లాలోని బార్ అసోసియేషన్లలో విస్తృతంగా ప్రచారం చేయాలన్నారు. కరోనా వైద్య సహాయార్ధం వారు న్యాయవాదులకు బాద్యులుగా వ్యవహరిస్తారని తెలిపారు.

కరోనా లక్షణాలున్న వారి విషయంలో నోడల్ అధికారి పరీక్షలు, చికిత్స అందించేందుకు తక్షణ చర్యలు తీసుకోవాలన్నారు. న్యాయవాదుల సంఘానికి దగ్గర్లోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో పరీక్షలు చేసి, ఫలితాలు త్వరాగా వచ్చేలా చూడాలని పేర్కొన్నారు. పాజిటివ్ వచ్చిన వారిని జిల్లా వైద్యాధికారి సలహా మేరకు కరోనా ఆసుపత్రి, క్వారంటైన్ కేంద్రంలో చేర్చేందుకు నోడల్ అధికారి చర్యలు తీసుకోవాలన్నారు. హోంక్వారంటైన్​లో ఉన్నవారికి ఉత్తమమైన వైద్య సాయం అందేలా చూడాలని తెలిపారు. ఈ నిబంధనలు హైకోర్టు న్యాయవాదుల సంఘం సభ్యులకు వర్తిస్తాయన్నారు. అవసరం మేరకు హైకోర్టులో ఉన్న ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని కరోనా పరీక్ష కేంద్రంగా వినియోగించుకోవచ్చని తెలిపారు. న్యాయవాదులకు కరోనా పరీక్షల కోసం ప్రత్యేక ఆసుపత్రులు కేటాయించేలా ఆదేశించాలని కోరుతూ హైకోర్టు న్యాయవాదుల సంఘం కార్యదర్శి ప్రసాద్ హైకోర్టులో పిల్ దాఖలు చేశారు. ఈ మేరకు ఏజీ వీటికి సంబంధించి విధివిధానలను కోర్టు ముందు ఉంచారు. హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ జేకే మహేశ్వరి నేతృత్వంలోని ధర్మాసనం వివరాలను పరిశీలించేందుకు విచారణను సోమవారానికి వాయిదా వేసింది.

ABOUT THE AUTHOR

...view details