తెలంగాణలో పదోతరగతి పరీక్షలు జూన్ 8 తర్వాత నిర్వహించనున్నారు. పరీక్షల నిర్వహణపై ఇవాళ హైకోర్టులో విచారణ జరిపిన ధర్మాసనం... పరీక్షా కేంద్రాల్లో కరోనా నివారణ జాగ్రత్తలు పాటించాలని స్పష్టం చేసింది.
తెలంగాణ: జూన్ 8 తర్వాత 'పది' పరీక్షలు - high court on commencement of tenth class exams
తెలంగాణలో జూన్ 8 తర్వాత పదో తరగతి పరీక్షలు జరగనున్నాయి. పరీక్షల నిర్వహణకు ఆ రాష్ట్ర హైకోర్టు అంగీకరించింది. కరోనా పరిస్థితులపై జూన్ 3న సమీక్ష నిర్వహించి మర్నాడు నివేదిక సమర్పించాలని ప్రభుత్వానికి హైకోర్టు ఆదేశించింది.
![తెలంగాణ: జూన్ 8 తర్వాత 'పది' పరీక్షలు tenth class exams](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-7260830-643-7260830-1589879706607.jpg)
tenth class exams
ప్రతి పరీక్షకు మధ్య రెండ్రోజుల వ్యవధి ఉండాలని చెప్పిన హైకోర్టు... భౌతిక దూరం సాధ్యం కాని కేంద్రాలను మార్చాలని ఆదేశించింది. లాక్‌డౌన్ సమయంలో పదో తరగతి పరీక్షలు నిర్వహించవద్దని సూచించిన కోర్టు... పరిస్థితి తీవ్రంగా ఉంటే అసలు పరీక్షలు నిర్వహించవద్దని తెలిపింది.
ఇదీ చదవండి:విశాఖ ఎల్జీ ఘటనపై ఫేస్బుక్లో పోస్ట్.. వృద్ధురాలికి అరెస్ట్ నోటీసులు