ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

చంద్రబాబుకు భద్రతపై హైకోర్టు కీలక తీర్పు - undefined

చంద్రబాబు భద్రత విషయమై హైకోర్టు కీలక తీర్పు వెలువరించింది. మొత్తం 97 మంది భద్రతా సిబ్బందిని కొనసాగించాలని రాష్ట్ర పభుత్వాన్ని ఆదేశించింది.

చంద్రబాబు 97 మంది భద్రతా సిబ్బందిని కొనసాగించండి : హైకోర్టు

By

Published : Aug 14, 2019, 5:22 PM IST

Updated : Aug 14, 2019, 6:34 PM IST

చంద్రబాబుకు భద్రతపై హైకోర్టు కీలక తీర్పు

తెదేపా అధినేత చంద్రబాబుకు భద్రత కుదింపుపై దాఖలైన వ్యాజ్యంపై విచారణ చేపట్టిన హైకోర్టు, తుది తీర్పు వెలువరిచింది. మొత్తం 97 మంది భద్రతా సిబ్బందిని కొనసాగించాలని ఆదేశాలు జారీచేసింది. కేంద్రం కల్పిస్తున్న ఎన్​ఎస్​జీ భద్రతలో ఎలాంటి మార్పు లేకపోయినప్పటకీ.. రాష్ట్ర ప్రభుత్వం కల్పిస్తున్న భద్రతను తగ్గించింది. ఇద్దరు సీఎస్​వోలకు బదులు ఒకరినే ఇచ్చారని చంద్రబాబు తరఫు న్యాయవాదులు కోర్టుకు వివరించారు. చంద్రబాబు కాన్వాయ్​లో జామర్ వాహనం కూడా ఏర్పాటుచేయలేదని కోర్టుకు నివేదించారు. ఈ అంశాలన్నింటినీ పరిగణలోకి తీసుకున్న ధర్మాసనం బుధవారం తీర్పునిచ్చింది. చంద్రబాబు మొత్తం 97 మంది భద్రతాసిబ్బందిని కొనసాగించాలని ఆదేశించింది. క్లోజ్‌డ్‌ సెక్యూరిటీ ఎవరి విధి అనేదానిపై ఎన్‌ఎస్‌జీ, స్టేట్‌ సెక్యూరిటీ మధ్య అభిప్రాయ భేదాలున్నాయన్న కోర్టు.. మూడు నెలల్లో ఓ నిర్ణయానికి రావాలని ఆ సంస్థలను ఆదేశించింది. చంద్రబాబు కాన్వాయ్‌లో జామర్‌ వాహనం కల్పించాలని ఆదేశించిన కోర్టు.. చంద్రబాబు భద్రత విషయమై సీఎస్‌వోను ప్రభుత్వం నియమించవచ్చని తెలిపింది.

Last Updated : Aug 14, 2019, 6:34 PM IST

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details