ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

కౌంటర్ దాఖలు చేయండి: హైకోర్టు - ఏపీ హైకోర్టు వార్తలు

రాజధాని గ్రామాల్లో పంచాయతీ ఎన్నికలు నిర్వహించకపోవటంపై హైకోర్టులో వ్యాజ్యం దాఖలయ్యింది. పంచాయతీల విలీనంపై పెండింగ్ పేరుతో ఎన్నికలు నిర్వహించకపోవటాన్ని పిటిషనర్లు ప్రశ్నించారు.

high court on capital villages elections
హైకోర్టు

By

Published : Feb 17, 2021, 7:57 AM IST

రాజధాని గ్రామాల్లో పంచాయతీ ఎన్నికలు నిర్వహించేలా ఆదేశించాలంటూ దాఖలైన వ్యాజ్యంలో కౌంటర్ దాఖలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది. తుళ్లూరు, తాడేపల్లి, మంగళగిరి మండలాల పరిధిలో పంచాయతీ ఎన్నికలు నిర్వహించకపోవడాన్ని ప్రశ్నిస్తూ పలువురు స్థానికులు హైకోర్టులో పిటిషన్ వేశారు. గ్రామ పంచాయతీల విలీనం ప్రతిపాదనలు పెండింగ్‌లో ఉన్నాయన్న కారణంతో ఎన్నికలు నిర్వహించకపోవడం సరికాదని వారు పేర్కొన్నారు. ఆయా ప్రతిపాదనలపై ఇప్పటివరకూ ఎలాంటి పురోగతీ లేదన్నారు. ఈ మేరకు కౌంటర్‌ దాఖలుకు ఆదేశించిన న్యాయమూర్తి జస్టిస్ సోమయాజులు... విచారణను మార్చి 2కు వాయిదా వేశారు.

ABOUT THE AUTHOR

...view details