HC On Women Care Secretaries: గ్రామ, వార్డు నచివాలయాల్లో మహిళ సంరక్షణ కార్యదర్శులను.. హోంశాఖలో మహిళ కానిస్టేబుళ్లుగా పరిగణిస్తూ రాష్ట్ర ప్రభుత్వం తాజాగా తీసుకొన్ని జీవో 1, 2 లను సవాలు చేస్తూ హైకోర్టులో వ్యాజ్యం దాఖలైంది. నెల్లూరు జిల్లాకు చెందిన మహిళ సంరక్షణ కార్యదర్శి కత్తుల రాధికతో పాటు వివిధ జిల్లాలకు చెందిన మరో 16 మంది సంరక్షణ కార్యదర్శులు ఈ వ్యాజ్యాన్ని దాఖలు చేశారు. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, హోంశాఖ, పంచాయతీరాజ్ శాఖ, మహిళ శిశు సంక్షేమశాఖ, పురపాలకశాఖ, గ్రామ, వార్డు సచివాలయ శాఖల ముఖ్య కార్యదర్శులను వ్యాజ్యంలో ప్రతివాదులుగా పేర్కొన్నారు. హైకోర్టు న్యాయమూర్తులు జస్టిస్ ప్రవీణ్ కుమార్, జస్టిస్ మన్మధరావుతో కూడిన ధర్మాసనం వద్దకు ఈ వ్యాజ్యం విచారణకు వచ్చింది. సింగిల్ జడ్జి విచారించాలా ? ధర్మాసనం విచారించాలా అనే వ్యవహారంపై రిజిస్ట్రీ నుంచి స్పష్టత వచ్చాక తగిన నిర్ణయం తీసుకుంటామని తెలిపింది. ప్రభుత్వ నిర్ణయం పోలీసు నియామక నిబంధనలకు విరుద్ధం అని పిటిషనర్లు వ్యాజ్యంలో పేర్కొన్నారు. సంరక్షణ కార్యదర్శులుగా నియమితులైన తమను గతేడాది జూన్లో ఇచ్చిన జీవో 59 ఆధారం చేసుకొని పోలీసు యూనిఫాం ధరించి మహిళ కానిస్టేబుల్ విధులు నిర్వర్తించాలని అధికారులు ఒత్తిడి చేస్తున్నారని తెలిపారు.
మహిళ సంరక్షణ కార్యదర్శులను పోలీసులుగా పరిగణించడంపై హైకోర్టులో పిటిషన్ - HC on Ap Women Care Secretaries
HC On Women Care Secretaries: గ్రామ, వార్డు నచివాలయాల్లో మహిళ సంరక్షణ కార్యదర్శులను.. మహిళ కానిస్టేబుళ్లుగా పరిగణిస్తూ రాష్ట్ర ప్రభుత్వం తీసుకొన్ని తాజా జీవోలను సవాలు చేస్తూ హైకోర్టులో వ్యాజ్యం దాఖలైంది. ప్రభుత్వ నిర్ణయం పోలీసు నియామక నిబంధనలకు విరుద్ధం అని పిటిషనర్లు వ్యాజ్యంలో పేర్కొన్నారు. సంరక్షణ కార్యదర్శులుగా నియమితులైన తమను పోలీసు యూనిఫాం ధరించి మహిళ కానిస్టేబుల్ విధులు నిర్వర్తించాలని అధికారులు ఒత్తిడి చేస్తున్నారని తెలిపారు.
హోంశాఖ ఏకపక్షంగా జీవో 59 తీసుకొచ్చిందన్నారు. ఆ జీవోను ననాలు చేస్తూ తాము హైకోర్టును ఆశ్రయించామన్నారు. విచారణ సెండింగ్లో ఉండగా జీవో 59 స్థానంలో జనవరి 12న జీవో 1 జారీచేశారన్నారు. పూర్వం ఉన్న సర్వీసు నిబంధనలను సవరించారని పేర్కొన్నారు. ఆ జీవో ప్రకారం మహిళ సంరక్షణ కార్యదర్శులు గ్రేడ్ -3 గా నియమితులైన వారిని 'మహిళ పోలీసు'గా గుర్తింపు ఇచ్చారన్నారు. ప్రభుత్వం తీసుకొచ్చిన నిబంధన అధికరణ 300 ఉల్లంఘిస్తోందన్నారు. పోలీసు నియామక ప్రక్రియ చేపట్టడానికి నియామక బోర్డు ఉందన్నారు. ఎంపిక ప్రక్రియకు పోటీ పరీక్ష ఉంటుందన్నారు. ఇంటర్ అర్హత అన్నారు. రూల్ ఆఫ్ రిజర్వేషన్ పాటించాల్సి ఉంటుందన్నారు. ఆ నియామక నిబందనలన్నింటిని ఉల్లంఘిస్తూ .. తమ గుర్తింపును మార్చారన్నారు. తాము ఇచ్చిన వినతిని పరిగణనలోకి తీసుకోకుండా హోంశాఖలో విలీనం చేయడం చట్ట విరుద్ధమన్నారు. ఈ అంశాల్ని సరిగణనలోకి తీసుకొని జీవో 1, 2లను రద్దు చేయాలని కోరారు. నాటి అమలును నిలుపుదల చేస్తూ మధ్యంతర ఉత్తర్వులివ్వాలని అభ్యర్థించారు.
ఇదీ చదవండి:మహిళ సంరక్షణ కార్యదర్శులను పోలీసులుగా పరిగణించడంపై హైకోర్టులో విచారణ...