అమరావతి భూములపై హైకోర్టులో విచారణ.. బుధవారానికి వాయిదా - latest news on amaravathi lands
అమరావతి రాజధాని ప్రాంతంలోని స్థలాలు ఇతర ప్రాంతాలవారికి కేటాయిస్తూ ఇచ్చిన జీవోకు వ్యతిరేకంగా... రైతులు వేసిన పిటిషన్పై విచారణ బుధవారానికి వాయిదా పడింది.
![అమరావతి భూములపై హైకోర్టులో విచారణ.. బుధవారానికి వాయిదా high court on amaravathi land issue](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-6220131-67-6220131-1582788315117.jpg)
జీవో నెం.107పై అమరావతి రైతులు వేసిన పిటిషన్లపై హైకోర్టులో విచారణ జరిగింది. రాజధాని ప్రాంతంలోని స్థలాలను ఇతర ప్రాంతాలవారికి కేటాయిస్తూ ప్రభుత్వం ఇచ్చిన జీవోకు వ్యతిరేకంగా రైతులు హైకోర్టులో ఈ పిటిషన్ దాఖలు చేశారు. ఇరు వర్గాలు వాదనలు వినిపించాయి. మరిన్ని వివరాలు సమర్పించేందు అడ్వకేట్ జనరల్ గడువు కోరారు. సోమవారం కౌంటర్ దాఖలు చేయాలని ధర్మాసనం ప్రభుత్వాన్ని ఆదేశించింది. మంగళవారం కౌంటర్ రిప్లై దాఖలు చేయాలని పిటిషనర్ల తరఫు న్యాయవాదికి సూచించింది. తదుపరి విచారణ వచ్చే బుధవారానికి వాయిదా పడింది.