ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

HIGH COURT ON AMARA RAJA: అమర్​రాజాపై మధ్యంతర ఉత్తర్వులు పొడిగింపు - ఏపీ తాజా వార్తలు

HIGH COURT ON AMARA RAJA: అమర్‌రాజా పరిశ్రమ మూసివేతకు కాలుష్య నియంత్రణ మండలి గతంలో ఇచ్చిన ఆదేశాలను నిలిపివేతను హైకోర్టు మరో సారి పొడిగించింది. కేసుకు సంబంధించి విచారణను జనవరి 6కు వాయిదా వేసింది.

HIGH COURT ON AMARA RAJA
HIGH COURT ON AMARA RAJA

By

Published : Dec 8, 2021, 5:24 AM IST

HIGH COURT ON AMARA RAJA POLLUTION CASE: అమర్‌రాజా పరిశ్రమ మూసివేతకు పీసీబీ ఇచ్చిన ఉత్తర్వుల అమలును నిలిపివేస్తూ గతంలో ఇచ్చిన ఆదేశాలను హైకోర్టు ధర్మాసనం మరోసారి పొడిగించింది. న్యాయమూర్తులు జస్టిస్‌ అసనుద్దీన్‌ అమానుల్లా, జస్టిస్‌ బికృష్ణమోహన్‌లతో కూడిన ధర్మాసనం మంగళవారం ఈ మేరకు ఆదేశాలిచ్చింది. ఈ వరిశ్రమలో ఉద్యోగుల రక్తంలో సీసం (లెడ్‌) శాతంపై వైద్య పరీక్ష నిర్వహించిన సంస్థ ఇచ్చిన నివేదికను హైకోర్టుకు సమర్పించకుండా ఏపీ కాలుష్య నియంత్రణ మండలి (పీసీబీ) సభ్య కార్యదర్శి న్యాయస్థానాన్ని తప్పుదోవ పట్టిస్తున్నారని పరిశ్రమ తరపు సీనియర్‌ న్యాయవాది బి.ఆదినారాయణరావు హైకోర్టు దృష్టికి తీసుకొచ్చారు. ఆయనపై కోర్టుధిక్కరణ చర్యలు ప్రారంభించాలని కోరారు.

పీసీబీ తరపు న్యాయవాది సురేందర్‌రెడ్డి మాట్లాడుతూ... కొన్నేళ్లుగా అమర్‌రాజా పరిశ్రమలో తనిఖీల్లేవని, కోర్టు ముందు చెప్పిన వివరాలను అఫిడవిట్‌ రూపంలో దాఖలు చేస్తే తిరుగు సమాధానంగా కౌంటర్‌ వేస్తామని వెల్లడించారు. ఇరువైపులా వాదనలను పరిగణనలోకి తీసుకున్న ధర్మాసనం ఈనెల 8 నాటికి అఫిడవిట్‌ దాఖలు చేయాలని అమర్‌రాజా పరిశ్రమను ఆదేశించింది. 17 లోపు కౌంటర్‌ వేయాలని పీసీబీకి స్పష్టం చేసింది. విచారణను జనవరి 6కు వాయిదా వేసింది.

ABOUT THE AUTHOR

...view details