పదో తరగతి పరీక్షలపై ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని హైకోర్టుకు ప్రభుత్వం నివేదించింది. ఇంటర్ పరీక్షలను వాయిదా వేస్తూ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుందని అడ్వొకేట్ జనరల్ శ్రీరామ్ హైకోర్టుకు నివేదించారు. మళ్లీ నిర్వహించేందుకు తేదీ ఏమైనా ఖరారు చేశారా? అని ధర్మాసనం అడిగిన ప్రశ్నకు లేదని ఏజీ బదులిచ్చారు. కరోనా, ఇతర అంశాల్ని పరిగణనలోకి తీసుకొని పరిస్థితులను సమీక్షించి తదుపరి నిర్ణయం ఉంటుందన్నారు. షెడ్యూల్ ఈ రోజే ఇచ్చి.. రేపో ఎల్లుండి నుంచో పరీక్షలు నిర్వహిస్తామని పేర్కొనరు కదా? అని ధర్మాసనం వ్యాఖ్యానించింది. విద్యార్థుల తగిన సమయం ఇస్తారా? లేదా? అని ఆరా తీసింది. తుది జారీకి ముందు విద్యార్థులు పరీక్షలకు సిద్ధమయ్యేందుకు సహజంగా తగిన సమయం ఇస్తామని ఏజీ కోర్టుకు తెలిపారు. విద్యార్థుల ప్రయోజనాలకు ప్రధమ ప్రాధాన్యత ఇస్తామన్నారు. ఆ వివరాల్ని పరిగణనలోకి తీసుకున్న హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ ప్రవీణ్ కుమార్, జస్టిస్ గంగారావుతో కూడిన ధర్మాసనం.. విచారణను జూన్ 2 వ తేదీకి వాయిదా వేసింది. ఈలోపు పరీక్షల నిర్వహణ విషయంలో ప్రభుత్వం చర్యలపై పిటిషనర్లకు అభ్యంతరం ఉంటే అనుబంధ పిటిషన్ దాఖలు చేయోచ్చని తెలిపింది.
పదో తరగతి పరీక్షలపై నిర్ణయం తీసుకోలేదు.. హైకోర్టుకు నివేదించిన ఏజీ - పదో తరగతి పరీక్షలపై హైకోర్టులో విచారణ న్యూస్
పదో తరగతి పరీక్షల వాయిదాపై ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని హైకోర్టుకు ప్రభుత్వం తెలిపింది. జూన్ 7 నుంచి పదో తరగతి పరీక్షల జరగుతాయని.. కరోనా రీత్యా వచ్చే మూడు వారాల్లో పరిస్థితులు ఎలా ఉంటాయో పరిశీలించి తర్వాత నిర్ణయం తీసుకుంటామని స్పష్టం చేసింది.
high court on 10th and inter exams