ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

High Court on Wakf‌ Board : వక్ఫ్‌ బోర్డు సభ్యులకు, సీబీఐకి హైకోర్టు నోటీసులు

High Court on wakf board : రాష్ట్ర వక్ఫ్‌ బోర్డు సభ్యుల నియామకాన్ని సవాలు చేస్తూ దాఖలైన ప్రజాహిత వ్యాజ్యంపై హైకోర్టు మంగళవారం విచారణ జరిపింది. ఈ మేరకు వక్ఫ్‌ బోర్డు సభ్యులకు, సీబీఐకి నోటీసులు జారీ చేసింది. అనంతరం విచారణను 4 వారాలకు వాయిదా వేసింది.

High Court
High Court

By

Published : Feb 23, 2022, 8:09 AM IST

High Court on wakf board : రాష్ట్ర వక్ఫ్‌ బోర్డు సభ్యుల నియామకాన్ని సవాలు చేస్తూ దాఖలైన ప్రజాహిత వ్యాజ్యంపై హైకోర్టు స్పందించింది. మైనారిటీ సంక్షేమశాఖ ముఖ్య కార్యదర్శి, వక్ఫ్‌ సీఈవో అలీంబాష, ఎనిమిది మంది బోర్డు సభ్యులు సహా సీబీఐకి నోటీసులు జారీ చేసింది. కౌంటర్‌ వేయాలని ఆదేశిస్తూ విచారణను 4 వారాలకు వాయిదా వేసింది. హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ప్రశాంత్‌కుమార్‌ మిశ్ర, జస్టిస్‌ ఎం.సత్యనారాయణమూర్తితో కూడిన ధర్మాసనం మంగళవారం ఈమేరకు ఆదేశాలిచ్చింది.

అనర్హులను వక్ఫ్‌ బోర్డు సభ్యులుగా నియమించారని, బోర్డు పరిపాలన వ్యవహారంలో చోటు చేసుకున్న అక్రమాలపై సీబీఐతో విచారణ జరిపించాలని కోరుతూ విజయవాడకు చెందిన వ్యాపారి అబ్దుల్‌ ఖాదర్‌ మహమ్మద్‌ హైకోర్టులో పిల్‌ వేశారు.

ABOUT THE AUTHOR

...view details