ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

గుంటూరు తూర్పు ఎమ్మెల్యే ముస్తఫాకు హైకోర్టు నోటీసులు - గుంటూరు తూర్పు ఎమ్మెల్యే ముస్తఫా క్రైమ్

గుంటూరు తూర్పు ఎమ్మెల్యే ముస్తఫాకు హైకోర్టు నోటీసులు జారీ అయ్యాయి. ఓ స్థలంలో ఎమ్మెల్యే కార్యాలయం నిర్మాణాన్ని వ్యతిరేకిస్తూ హైకోర్టులో ప్రజాప్రయోజన వ్యాజ్యం దాఖలైంది.

high-court-notices-to-gunturu-east-mla-mustafa
high-court-notices-to-gunturu-east-mla-mustafa

By

Published : Apr 1, 2021, 7:48 PM IST

గుంటూరులో రెడ్ ట్యాంక్ సమీపంలో ఉన్న నగరపాలక సంస్థ స్థలాన్ని లీజుకు తీసుకుని ఎమ్మెల్యే ముస్తఫా.. తన కార్యాలయ నిర్మాణం చేపట్టారు. అప్పటికే అక్కడ ఉన్న దుకాణాలకు దారి లేకుండా కార్యాలయం నిర్మిస్తుండటంపై అభ్యంతరాలు వ్యక్తమయ్యాయి. ఈ విషయంపై.. ఓ దుకాణంలో వ్యాపారం చేసుకునే షేక్‌ అబ్దుల్‌ కరీం హైకోర్టులో ప్రజాప్రయోజన వ్యాజ్యం దాఖలు చేశారు. పిటిషన్​ను హైకోర్టు విచారణకు స్వీకరించింది. నగరపాలక సంస్థకు డబ్బు చెల్లించి ఆ స్థలాన్ని లీజుకు తీసుకున్నప్పటికీ ఇతరులకు ఇబ్బంది లేకుండా నిర్మాణం జరపాలని పిటిషన్ దారులు కోర్టుకు తెలిపారు. స్థలాన్ని లీజుకు కేటాయించే సమయంలో ఆ విషయాన్ని బహిరంగ ప్రకటన ద్వారా అందరికీ తెలియజేయాల్సి ఉంది.

నగరపాలక సంస్థ అధికారులు ఆ పని చేయలేదు. నిర్దేశిత మొత్తాన్ని చెల్లించగానే ఎమ్మెల్యేకు స్థలాన్ని లీజుకు ఇచ్చారు. దీంతో నగరపాలక సంస్థ అధికారులపైనా విమర్శలు వచ్చాయి. నిబంధనల ప్రకారం స్థలాన్ని లీజుకు తీసుకునే అక్కడ కార్యాలయం నిర్మిస్తున్నట్లు ముస్తఫా తరఫు న్యాయవాది కోర్టుకు తెలిపారు. అయితే నిర్మాణానికి సంబంధించి ప్లాన్ ఉందా? దానికి కార్పొరేషన్ అనుమతి లభించిందా? అని హైకోర్టు ప్రశ్నించింది. వాటికి సంబంధించి అన్ని వివరాలు సమర్పించాలని ముస్తఫాతో పాటు కార్పొరేషన్‌ అధికారులను హైకోర్టు ఆదేశించింది. విచారణను రెండు వారాలకు వాయిదా వేసింది.

ABOUT THE AUTHOR

...view details