hc on foreign education scheme for Muslim students : ముస్లిం విద్యార్థులకు విదేశీ విద్య పథకాన్ని అమలు చేయపోవడాన్ని సవాలు చేస్తూ దాఖలైన ప్రజాహిత వ్యాజ్యంలో రాష్ట్ర ప్రభుత్వానికి హైకోర్టు నోటీసులు జారీచేసింది. విచారణను నాలుగు వారాలకు వాయిదా వేసింది. హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ప్రశాంతకుమార్ మిశ్ర, జస్టిన్ సత్యనారాయణమూర్తితో కూడిన ధర్మాసనం ఈ మేరకు ఆదేశాలిచ్చింది.
high court : ముస్లిం విద్యార్థులకు విదేశీ విద్య... ప్రభుత్వానికి హైకోర్టు నోటీసులు - ముస్లిం విద్యార్థులకు విదేశీ విద్యపై హోకోర్టులో విచారణ
hc on foreign education scheme for Muslim students : విదేశీ విద్య పథకాన్ని ముస్లిం విద్యార్థులకు అమలు చేయకపోవటాన్ని సవాలు చేస్తూ హైకోర్టులో పిల్ ధాఖలైంది. ఈ వ్యాజ్యంపై విచారణ జరిపిన ధర్మాసనం.. ప్రభుత్వానికి నోటీసులు జారీ చేసింది.
ముస్లింలకు విదేశీ విద్య పథకాన్ని ప్రస్తుత ప్రభుత్వం అమలు చేయకపోవడాన్ని, విద్యార్థులకు చెల్లించాల్సిన బకాయిలను చెల్లించకపోవడాన్ని సవాలు చేస్తూ మైనార్టీ హక్కుల పరిరక్షణ సమితి అధ్యక్షుడు మహ్మద్ ఫరూక్ షిబ్లి హైకోర్టులో పిల్ వేశారు. న్యాయవాదులు డీఎన్ఎన్ ప్రసాదబాబు, సలీంపాషా వాదనలు వినిపిస్తూ.. మైనార్టీ విద్యార్థులు విదేశాల్లో విద్య అభ్యసించేందుకు అవకాశం కల్పిస్తూ 2016 సెప్టెంబర్ 29న అప్పటి ప్రభుత్వం జీవో 33ను తీసుకొచ్చిందన్నారు. ప్రస్తుత ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఆ జీవోను అమలు చేయడం లేదన్నారు. విద్యను అభ్యసించిన సుమారు 527 మందికి బకాయిలు చెల్లించాల్సి ఉందన్నారు. ఆ వాదనలను పరిగణనలోకి తీసుకున్న ధర్మాసనం ప్రభుత్వానికి నోటీసులు జారీచేస్తూ కౌంటర్లు వేయాలని ఆదేశించింది.
ఇదీ చదవండి