పంచాయతీ ఎన్నికలకు అనుమతించిన హైకోర్టు పలు కీలక వ్యాఖ్యలు చేసింది. తమ ప్రతినిధులను ఎన్నుకునే హక్కు ప్రజలకు ఉంటుందని గుర్తు చేసింది. ఎన్నికలు ఎలా నిర్వహించాలనే విషయంపై తుది నిర్ణయం రాష్ట్ర ఎన్నికల సంఘానిదే అని స్పష్టం చేసింది.
'సీఈసీకి ఉన్న అధికారాలే ఎస్‌ఈసీకి ఉన్నాయి. సింగిల్ బెంచ్ తీర్పు ప్రాథమిక సూత్రాలకు భిన్నంగా ఉంది. ఎస్‌ఈసీకి దురుద్దేశాలు ఆపాదించడం సరికాదు. ఎన్నికైన నేతలు వ్యాక్సినేషన్‌ను ముందుకు తీసుకువెళ్తారు. వ్యాక్సినేషన్ పేరుతో ఎన్నికల వాయిదా కోరడం సరికాదు. మూడో దశలో భారీ సంఖ్యలో వ్యాక్సినేషన్ ఉన్నందున ఈలోగా ఎన్నికలు సబబే' అని హైకోర్టు స్పష్టం చేసింది.