MLC Ananthababu case: దళిత యువకుడు సుబ్రహ్మణ్యం హత్య విషయంలో వైకాపా ఎమ్మెల్సీ అనంతబాబుపై నమోదు చేసిన కేసు దర్యాప్తును సీబీఐకి అప్పగించాలని కోరుతూ దాఖలైన వ్యాజ్యంపై హైకోర్టు స్పందించింది. పూర్తి వివరాలతో కౌంటర్ దాఖలు చేయాలని పేర్కొంటూ కేంద్ర హోంశాఖ, రాష్ట్ర హోంశాఖ ముఖ్యకార్యదర్శి, డీజీపీ, సీబీఐ డైరెక్టర్, తదితరులకు నోటీసులు జారీచేసింది. విచారణను రెండు వారాలకు వాయిదా వేసింది. హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ రవినాథ్ తిల్హరీ గురువారం ఈ మేరకు ఆదేశాలిచ్చారు. తన కుమారుడి హత్య వ్యవహారంలో వైకాపా ఎమ్మెల్సీ అనంతబాబుపై నమోదు చేసిన కేసు దర్యాప్తును సీబీఐకి అప్పగించాలని కోరుతూ మృతుడు సుబ్రహ్మణ్యం తల్లిదండ్రులు వీధి నూకరత్నం, సత్యనారాయణ హైకోర్టును ఆశ్రయించిన విషయం తెలిసిందే. రాష్ట్ర పోలీసు యంత్రాంగం అధికార పార్టీకి చెందిన ఎమ్మెల్సీ/నిందితుడు అనంతబాబుతో కుమ్మక్కుఅయ్యారన్నారు. పిటిషనర్ల తరఫున న్యాయవాది జడ శ్రావణ్‌కుమార్ వాదనలు వినిపిస్తూ.. ఈ కేసు దర్యాప్తును సీబీఐకి అప్పగించాలని కోరారు. ఈ మేరకు న్యాయమూర్తి ప్రతివాదులకు నోటీసులు జారీచేశారు.
ఆ ఎమ్మెల్సీ కేసులో కేంద్రం, రాష్ట్రం, సీబీఐలకు హైకోర్టు నోటీసులు - ఏపీ తాజా వార్తలు
MLC Ananthababu case: దళిత యువకుడు సుబ్రహ్మణ్యం హత్య విషయంలో వైకాపా ఎమ్మెల్సీ అనంతబాబుపై నమోదు చేసిన కేసు దర్యాప్తును సీబీఐకి అప్పగించాలని కోరుతూ దాఖలైన వ్యాజ్యాలపై... హైకోర్టు స్పందించింది. పూర్తి వివరాలతో కౌంటర్ దాఖలు చేయాలని పేర్కొంటూ.... కేంద్ర హోంశాఖ, రాష్ట్ర హోంశాఖ ముఖ్యకార్యదర్శి, తదితరులకు నోటీసులు జారీచేసింది. విచారణను రెండు వారాలకు వాయిదా వేసింది.
ఎమ్మెల్సీ అనంతబాబు కేసు