రాజధాని అమరావతిపై ప్రభుత్వం నియమించిన నిపుణుల కమిటీని సవాలు చేస్తూ ఆ ప్రాంతానికి చెందిన మరికొంతమంది రైతులు హైకోర్టులో వ్యాజ్యం దాఖలు చేశారు. దీనిపై శుక్రవారం హైకోర్టు విచారణ చేపట్టింది. దీనికి సంబంధించి మంత్రులు బొత్స సత్యనారాయణ, బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డి, కేంద్ర హోంశాఖ కార్యదర్శి, రాష్ట్ర సీఎస్, సీఆర్‌డీఏ కమిషనర్, ఛైర్మన్, పురపాలక, ఆర్థిక శాఖల ముఖ్య కార్యదర్శులతో పాటు జీఎన్ రావు కమిటీకి నోటీసులు జారీచేసింది. పూర్తి వివరాలతో ప్రమాణపత్రాలు దాఖలు చేయాలని ఆదేశించింది. ఇదే అంశంపై ఇప్పటికే దాఖలైన మరో వ్యాజ్యంతో ప్రస్తుత పిటిషన్‌ను జత చేయాలని రిజిస్ట్రీని ఆదేశించింది. విచారణను ఈనెల 28కి వాయిదా వేసింది.
మంత్రులు బొత్స, బుగ్గనకు హైకోర్టు నోటీసులు - high court notices to amarvathi committee
రాజధానిపై ప్రభుత్వం నియమించిన నిపుణుల కమిటీని సవాలు చేస్తూ ఇటీవలే అమరావతి ప్రాంత రైతులు హైకోర్టులో వ్యాజ్యం దాఖలు చేశారు. వారి బాటలోనే మరికొంతమంది రైతులు న్యాయస్థానంలో పిటిషన్ వేశారు. దీనిపై శుక్రవారం విచారణ జరిగింది.
![మంత్రులు బొత్స, బుగ్గనకు హైకోర్టు నోటీసులు](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-5078933-393-5078933-1573868274300.jpg)
హైకోర్టు
TAGGED:
latest news in amaravathi