సామాజిక మాధ్యమాల్లో న్యాయమూర్తులు, న్యాయస్థానాలపై అనుచిత వ్యాఖ్యలు చేసిన కేసులో నిందితులైన ఇద్దరు న్యాయవాదులకు హైకోర్టు షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది. ప్రతీ సోమవారం విజయవాడలోని సీబీఐ క్యాంపు కార్యాలయంలో సంతకాలు పెట్టాలని ఆదేశించింది.
సోషల్ మీడియా కేసులో ఇటీవల న్యాయవాదులు కళానిధి గోపాలకృష్ణ, మెట్ట చంద్రశేఖర్లను సీబీఐ అధికారులు అరెస్ట్ చేశారు. ఈ కేసులో బెయిల్ మంజూరు చేయాలని కోరుతూ ఇరువురు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. కళానిధి గోపాలకృష్ణకు ఆరోగ్యం సరిలేదని న్యాయవాది వాదనలు వినిపించారు. వాదనలు విన్న న్యాయస్థానం ఇరువురు న్యాయవాదులకు షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.