ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

కుటుంబరావు వ్యాజ్యంపై హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు - high court issue interim orders in kutumbarao petion

విజయవాడ పరిధిలో తమకు చెందిన భూమిని అక్రమంగా అధికారులు స్వాదీనం చేసుకున్నారని  కుటుంబరావు దాఖలు చేసిన వ్యాజ్యంపై హైకోర్టు విచారణ జరిపింది. తుది తీర్పు ఇచ్చేంత వరకు ఇతరులకు హక్కులు కల్పించొద్దని ఆదేశాలు జారీ చేసింది.

high-court-issue-interim-orders-in-kutumbarao-petion

By

Published : Sep 25, 2019, 12:06 AM IST


విజయవాడ మాచవరం పరిధిలో తమకు చెందిన 5.10 ఎకరాల భూమిని అధికారులు అక్రమంగా స్వాధీనం చేసుకున్నారంటూ రాష్ట్ర ప్రణాళిక బోర్డు మాజీ ఉపాధ్యక్షుడు కుటుంబరావు దాఖలు చేసిన వ్యాజ్యంపై విచారణ జరిపింది . ఈ వ్యాజ్యంలో ధర్మాసనం మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. తాము తుది తీర్పు ఇచ్చేంత వరకు ఆ భూమిపై ఇతరులకు హక్కు కల్పించొద్దని అధికారులను ఆదేశించింది. ప్రతివాదులకు అందుకు
సంబంధించిన నోటీసులు జారీ చేసింది. హైకోర్టు న్యాయమూర్తి ఈ మేరకు ఆదేశాలు జారీ చేశారు.

ABOUT THE AUTHOR

...view details