ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

'స్థానిక సంస్థల ఎన్నికల్లో రిజర్వేషన్ల'పై హైకోర్టులో వాదనలు - ఏపీ స్థానిక సంస్థల ఎన్నికల న్యూస్

స్థానిక సంస్థల ఎన్నికల్లో రిజర్వేషన్ల అంశంపై హైకోర్టులో వాదనలు జరిగాయి. ఈ కేసులో ఇప్పటికే ఇరుపక్షాల వాదనలు విని ధర్మాసనం తీర్పు రిజర్వ్ చేసింది.

high-court-inquiry-on-local-body-elections
high-court-inquiry-on-local-body-elections

By

Published : Feb 25, 2020, 3:00 PM IST

స్థానిక సంస్థల ఎన్నికల్లో రిజర్వేషన్ల అంశంపై హైకోర్టులో వాదనలు

స్థానిక సంస్థల ఎన్నికల్లో రిజర్వేషన్ల అంశంపై హైకోర్టులో మరోసారి వాదనలు జరిగాయి. స్థానిక సంస్థల ఎన్నికల్లో సుమారు 59.85 శాతం రిజర్వేషన్లను ఖరారు చేస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడంపై కొందరు హైకోర్టును ఆశ్రయించారు. ఈ కేసులో ఇప్పటికే ఇరుపక్షాల వాదనలు విన్న ఉన్నత న్యాయస్థానం.... తీర్పును రిజర్వ్ చేసింది. అయితే ఇవాళ మరోసారి వాదనలు విన్న హైకోర్టు.... మరోసారి తీర్పును రిజర్వ్ చేసింది. సుప్రీంకోర్టు ఆదేశాల ప్రకారం రిజర్వేషన్లు 50 శాతానికి మించకూడదని.... అయితే ప్రభుత్వం తమ వాదనను సమర్థించుకునేందుకు ప్రత్యేక పరిస్థితుల అంశాన్ని తెరపైకి తీసుకువస్తుందని పిటిషనర్ తరఫు న్యాయవాది అన్నారు.

ABOUT THE AUTHOR

...view details