ధిక్కరణ కేసులో కోర్టుకు హాజరుకాకుంటే నాన్‌బెయిల్ వారెంట్ జారీ: హైకోర్టు - ఆర్థికశాఖ ప్రధాన కార్యదర్శి ఎస్ఎస్ రావత్ జరిమానా విధింపును వెనక్కి తీసుకున్న హైకోర్టు
13:38 October 28
ఆర్థికశాఖ ప్రధాన కార్యదర్శి ఎస్ఎస్ రావత్‌పై హైకోర్టు ఆగ్రహం
కోర్టు ధిక్కరణ కేసుల్లో నోటీసులు అందుకుని విచారణకు హాజరుకాకపోతే ఎంత పెద్ద అధికారిపై అయినా నాన్‌బెయిల్‌బుల్ వారెంట్ జారీ చేస్తామని హైకోర్టు హెచ్చరించింది. కోర్టుధిక్కరణ కేసుల్లో స్పందించకపోవడం న్యాయస్థానాలను మరింత కించపరచడమేనని వ్యాఖ్యానించింది. నోటీసు అందుకున్నప్పటికీ విచారణకు హాజరుకాకపోవడంతోపాటు న్యాయవాదిని నియమించుకోలేదంటూ ఆర్థికశాఖ ముఖ్య కార్యదర్శి ఎస్ఎస్. రావత్‌పై నాన్‌బెయిల్ వారెంట్ జారీ చేస్తూ రూ.5లక్షలు పూచీకత్తు సమర్పించాలని ఆదేశించింది. దీనిపై ప్రభుత్వ న్యాయవాది స్పందిస్తూ వ్యాజ్యం విచారణకు వచ్చినప్పుడు తాను మరో కోర్టులో ఉన్నానని, క్షమాపణలు కోరారు. వారెంటు ఉపసంహరించుకోవాలని అభ్యర్థించారు. సంతృప్తి చెందిన ధర్మాసనం అంతకుముందు ఇచ్చిన ఉత్తర్వులను ఉపసంహరించింది. కౌంటర్ వేయాలని ఆదేశించింది.
ఇదీ చదవండి..
TAGGED:
fine to rawath - breaking