"ప్రభుత్వ ఆర్థిక వ్యవహారాల్లో... కోర్టులు జోక్యం చేసుకోలేవు" - ఏపీ తాజా వార్తలు
AP Beverages Corporation: ఏపీ బెవరేజెస్ కార్పొరేషన్‌కు మద్యం అమ్మకాల ద్వారా వచ్చే ఆదాయం వ్యవహారంలో ఎంపీ రఘురామకృష్ణరాజు దాఖలు చేసిన ప్రజాహిత వ్యాజ్యంలో మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వడానికి హైకోర్టు నిరాకరించింది. ప్రభుత్వ ఆర్థిక వ్యవహారాల్లో జోక్యం చేసుకోలేవని స్పష్టం చేసింది. తదుపరి విచారణను జూన్ 15కి వాయిదా వేసింది.
AP Beverages Corporation: ఏపీ బేవరేజెన్ కార్పొరేషన్లు మద్యం అమ్మకాల ద్వారా వచ్చే ఆదాయాన్ని తనఖా పెట్టి రాష్ట్ర ప్రభుత్వం రుణం పొందేందుకు యత్నిస్తోందని ఆ ప్రక్రియను నిలువరించాలని కోరుతూ ఎంపీ రఘురామకృష్ణరాజు దాఖలు చేసిన ప్రజాహిత వ్యాజ్యంలో మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వడానికి హైకోర్టు నిరాకరించింది. ప్రస్తుతం మధ్యంతర ఉత్తర్వులిచ్చే ప్రశ్నే ఉత్పన్నం కాదని వ్యాఖ్యానించింది. ప్రభుత్వ ఆర్థిక వ్యవహారాల్లో కోర్డులు జోక్యం చేసుకోలేవని, ఇదే విషయాన్ని సుప్రీంకోర్టు గతంలో పలు తీర్పులు ఇచ్చిందని గుర్తుచేసింది. న్యాయస్థానాలు ప్రభుత్వాలను నడిపించలేదని పేర్కొంది. ప్రభుత్వ ఆర్థిక నిర్వహణ తీరుపై అభ్యంతరం ఉంటే పార్లమెంట్లో గళమెత్తాలని సూచించింది. ప్రస్తుతం ఈ వ్యాజ్యంలో ఎలాంటి ఉత్తర్వులు ఇవ్వలేమని పేర్కొంటూ తదుపరి విచారణను జూన్ 15కి వాయిదా వేసింది. హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ప్రశాంతకుమార్ మిశ్రా, జస్టిస్ ఎం.సత్యనారాయణ మూర్తితో కూడిన ధర్మాసనం ఈ మేరకు ఆదేశాలు జారీచేసింది.
ఇదీ చదవండి: ముగ్గురు ఐఏఎస్‌లకు.. జైలుశిక్ష విధించిన హైకోర్టు