ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

నిబంధనలు పాటించని ప్రైవేటు పాఠశాలలపై చర్యలు: హైకోర్టు - ప్రైవేటు పాఠశాలలపై హైకోర్టులో వాదనల వార్తలు

నిబంధనలకు విరుద్ధంగా వార్షికోత్సవాల పేరుతో ప్రైవేటు విద్యాసంస్థలు డబ్బులు వసూలు చేస్తున్నారంటూ దాఖలైన వ్యాజ్యంపై హైకోర్టు విచారణ చేపట్టింది. నిబంధనలు పాటించని ప్రైవేటు పాఠశాలలపై చర్యలు తీసుకుంటామని తెలిపింది. ఆ పాఠశాలల వివరాలు కోర్టుకు అందజేయాలని పిటిషనర్​ను ఆదేశించింది.

high court hearings on private schools money collection for anniversaries
ఏపీ హైకోర్టు

By

Published : Jun 23, 2020, 3:18 PM IST

నిబంధనలు పాటించని ప్రైవేటు పాఠశాలలపై చర్యలు తీసుకుంటామని హైకోర్టు తెలిపింది. నిబంధనలకు విరుద్ధంగా వార్షికోత్సవాల పేరుతో ప్రైవేటు విద్యాసంస్థలు డబ్బులు వసూలు చేస్తున్నారంటూ దాఖలైన వ్యాజ్యంపై ధర్మాసనం విచారణ చేపట్టింది.

కొన్ని ప్రైవేటు స్కూల్స్ వార్షికోత్సవాలకు విద్యార్థుల నుంచి ఫీజులు తీసుకుంటున్నారంటూ పిటిషనర్ తరఫు న్యాయవాది శ్రవణ్ కోర్టు దృష్టికి తీసుకువచ్చారు. కోర్టు ఆదేశాలు అమలు చేయని పాఠశాలల వివరాలు తమ ముందు ఉంచాలని న్యాయస్థానం పిటిషనర్​ను ఆదేశించింది. తదుపరి విచారణను వాయిదా వేసింది.

ABOUT THE AUTHOR

...view details