ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

ఆనందయ్య చుక్కల మందు పంపిణీపై హైకోర్టులో నేడు విచారణ - ఆనందయ్య చుక్కల మందుపై విచారణ చేయనున్న హైకోర్టు న్యూస్

ఆనందయ్య మందు పంపిణీపై నేడు హైకోర్టులో విచారణ జరగనుంది. మందు పంపిణీ చేయాలని కోరుతూ 4 వ్యాజ్యాలు దాఖలయ్యాయి.

ఆనందయ్య చుక్కల మందు పంపిణీపై హైకోర్టులో నేడు విచారణ
ఆనందయ్య చుక్కల మందు పంపిణీపై హైకోర్టులో నేడు విచారణ

By

Published : Jun 3, 2021, 8:24 AM IST

Updated : Jun 3, 2021, 9:10 AM IST

ఆనందయ్య మందు పంపిణీపై హైకోర్టు ఇవాళ విచారణ చేయనుంది. ఔషధ పంపిణీకి గత విచారణలోనే అనుమతించింది న్యాయస్థానం. చుక్కల మందు పంపిణీపై నేడు విచారణ చేయనుంది. కంట్లో వేసే డ్రాప్స్‌ తప్ప, ఆనందయ్య ఇస్తున్న మందులకు ప్రభుత్వం గ్రీన్‌సిగ్నల్‌ ఇచ్చిన విషయం తెలిసిందే. కంట్లో వేసే డ్రాప్స్‌ విషయంలో పూర్తి నివేదికలు రావాల్సి ఉందని, నివేదికలు రావడానికి మరో 2- 3 వారాల సమయం పడుతుంది కాబట్టి అనుమతి ఇవ్వలేకపోతున్నట్లు పేర్కొంది.

'కె' అనే మందును కూడా కమిటీ ముందు చూపించలేదు కాబట్టి దీనికి అనుమతి నిరాకరిస్తున్నట్లు ప్రభుత్వం తెలిపింది. ఆనందయ్య ఇచ్చే పి, ఎల్, ఎఫ్‌... మందులకు గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చింది. ఆనందయ్య మందు వాడితే కొవిడ్‌ తగ్గుతుంది అనడానికి నిర్ధారణలు లేవని తేల్చిన దృష్ట్యా మందు వాడినంత మాత్రాన మిగిలిన మందులు ఆపొద్దని గతంలోనే స్పష్టం చేసింది.

కొవిడ్ చికిత్సపై దాఖలైన పిటిషన్లపైనా.. విచారణ

కొవిడ్ చికిత్సపై హైకోర్టులో దాఖలైన పిటిషన్లపైనా నేడు విచారణ జరగనుంది. గత విచారణలో ఆక్సిజన్ సరఫరా, పడకల లభ్యతపై గత విచారణలో వివరాలను ధర్మాసనం అడిగింది. ఆస్పత్రుల్లో బాధితుల ఆరోగ్య స్థితి బంధువులకు తెలపాలని సూచించింది.

ఇదీ చదవండి:

jagananna house: వైఎస్‌ఆర్‌ జగనన్న కాలనీల ఇళ్ల నిర్మాణానికి నేడు శ్రీకారం

Last Updated : Jun 3, 2021, 9:10 AM IST

ABOUT THE AUTHOR

...view details