రేషన్ పంపిణీ వాహనాలకు రంగులు మార్చాలన్న ఎస్ఈసీ ఆదేశాలను సవాలు చేస్తూ.. ప్రభుత్వం హైకోర్టులో వేసిన పిటిషన్ మీద న్యాయస్థానంలో ఈరోజు విచారణ జరిగింది. రంగుల మార్పు ఖర్చుతో కూడుకున్న పని కాగా.. రేషన్ పంపిణీ నిరంతర ప్రక్రియ అని ప్రభుత్వం తరపు న్యాయవాది కోర్టుకు తెలిపారు. వాహనాలపై సీఎం జగన్ ఫొటోలు ఉన్నాయా అని ప్రశ్నించిన ధర్మాసనం.. వాటి ఫొటోలను న్యాయస్థానానికి సమర్పించాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది.
రేషన్ పంపిణీ వాహనాల ఫొటోలు సమర్పించండి : హైకోర్టు - high court ordered government to submit ration vehicle photo
ఎస్ఈసీ ఆదేశాలను సవాలు చేస్తూ.. రేషన్ పంపిణీ వాహనాలకు రంగుల మార్పుపై హైకోర్టులో ప్రభుత్వం వేసిన పిటిషన్ ఈరోజు విచారణకు వచ్చింది. ఆ వాహనాల ఫొటోలను న్యాయస్థానానికి సమర్పించాలని ప్రభుత్వాన్ని ధర్మాసనం ఆదేశించింది. వాటిపై సీఎం జగన్ ఫొటో ఉందా అని ఆరా తీసింది.

రేషన్ వాహనాలకు రంగుల మార్పుపై హైకోర్టు విచారణ