ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

స్టీల్‌ప్లాంట్ ప్రైవేటీకరణపై హైకోర్టులో విచారణ.. కౌంటర్ దాఖలుకు సమయం కోరిన కేంద్రం - అమరావతి తాజా వార్తలు

High Court on Visakha Steel Plant: విశాఖ స్టీల్‌ప్లాంట్ ప్రైవేటీకరణపై హైకోర్టులో విచారణ జరిగింది. స్టీల్‌ప్లాంట్ భూముల విలువ కేవలం రూ.55 కోట్లు చూపడంపై పిటిషనర్ తరఫు న్యాయవాది అభ్యంతరం తెలిపారు. కౌంటర్ దాఖలుకు కేంద్ర ప్రభుత్వ న్యాయవాది సమయం కోరారు. తదుపరి విచారణను 4 వారాలకు వాయిదా వేసింది.

High Court
విశాఖ స్టీల్‌ప్లాంట్​పై హైకోర్టు

By

Published : Oct 12, 2022, 3:35 PM IST

High Court on Visakha Steel Plant: విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణపై సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ దాఖలు చేసిన పిటిషన్​పై హైకోర్టు విచారణ జరిపింది. సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ విచారణకు హాజరయ్యారు. విశాఖ స్టీల్ ప్లాంట్ భూముల విలువ కేవలం రూ.55 కోట్లు చూపడంపై పిటిషనర్ తరఫు న్యాయవాది వై. బాలాజీ అభ్యంతరం తెలిపారు. బహిరంగ మార్కెట్​లో రూ.60 వేల కోట్లు ఉంటుందని పిటిషనర్ ధర్మాసనం దృష్టికి తీసుకొచ్చారు. ఐదు వేల కోట్లు కేటాయిస్తే స్టీల్ ప్లాంట్ సమస్య తీరుతుందని పిటిషనర్ కోర్టుకు తెలిపారు. కౌంటర్ దాఖలు చేసేందుకు కేంద్ర ప్రభుత్వ న్యాయవాది సమయం కోరారు. దీంతో తదుపరి విచారణను నాలుగు వారాలకు హైకోర్టు వాయిది వేసింది.

ABOUT THE AUTHOR

...view details