ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

ఆ కేసులో దర్యాప్తును సీబీఐకి అప్పగిస్తే అభ్యంతరం లేదు: ఏజీ శ్రీరామ్​

AP High Court News: నెల్లూరు కోర్టులో దస్త్రాల చోరీ కేసులో దర్యాప్తును సీబీఐకి అప్పగిస్తే తమకు అభ్యంతరం లేదని రాష్ట్ర ప్రభుత్వం తరపు ఏజే ఎస్.శ్రీరామ్.. హైకోర్టుకు తెలిపారు. మరోవైపు కేసు దర్యాప్తు పురోగతి వివరాలను కోర్టు ముందు ఉంచామన్నారు. వాటిని పరిశీలించేందుకు హైకోర్టు తరపు న్యాయవాది అశ్వనీకుమార్ సమయం కోరడంతో విచారణను వాయిదా పడింది.

ap hc on nellore court issue
ap hc on nellore court issue

By

Published : May 7, 2022, 6:07 AM IST

వ్యవసాయశాఖ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి నిందితుడిగా ఉన్న కేసుకు సంబంధించిన ఆధారాలు నెల్లూరు నాలుగో అదనపు జూనియర్ సివిల్ జడ్డీ కోర్టు నుంచి చోరీకి గురైన కేసు, తెదేపా నేత సోమిరెడ్డి చంద్రమోహన్‌ రెడ్డి దాఖలు చేసిన ఫోర్టరీ కేసును సీబీఐ దర్యాప్తునకు అప్పగిస్తే తమకు అభ్యంతరం లేదని రాష్ట్ర ప్రభుత్వం తరపు ఏజే ఎస్.శ్రీరామ్ హైకోర్టుకు తెలిపారు. ఆమేరకు అపిడవిట్ దాఖలు చేశామన్నారు. మరోవైపు కేసు దర్యాప్తు పురోగతి వివరాలను కోర్టు ముందు ఉంచామన్నారు. ఆ వివరాలను పరిశీలించి స్పందించేందుకు హైకోర్టు తరపు న్యాయవాది అశ్వనీకుమార్ సమయం కోరడంతో విచారణను వాయిదా పడింది. వేసవి సెలవుల తర్వాత విచారణ జరుపుతామని హైకోర్టు స్పష్టంచేసింది. హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిన్ ప్రశాంతకుమార్ మిశ్ర, జస్టిన్ సత్యనారాయణ మూర్తితో కూడిన ధర్మాసనం ఈమేరకు ఆదేశాలు జారీచేసింది.

తెదేపా నేత సోమిరెడ్డి చంద్రమోహన్‌ రెడ్డికి విదేశాల్లో వేల కోట్ల రూపాయల ఆస్తులున్నాయని 2017లో ఆరోపించిన కాకాణి గోవర్ధన్‌ రెడ్డి.. అందుకు ఆధారాలున్నాయని పత్రాలు విడుదల చేశారు. అవి నకిలీ (ఫోర్జరీ) పత్రాలని ఈ వ్యవహారంపై కేసు నమోదు చేయాలని సోమిరెడ్డి పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో కాకాణి గోవర్ధన్​ రెడ్డిని ఏ1గా పేర్కొంటూ పోలీసులు కేసు నమోదు చేసి అభియోగపత్రం వేశారు. ఈ వ్యవహారానికి సంబంధించిన కేసు ఆధారాలు నెల్లూరు నాలుగో అదనపు జూనియర్ సివిల్ జడ్జి కోర్టు నుంచి గత నెలలో రాత్రి దొంగతనానికి గురైన ఘటన సంచలనం కలిగించింది. ఈ వ్యవహారాన్ని సుమోటో పిల్‌గా పరిగణించిన హైకోర్టు.. మంత్రి కాకాణితో పాటు మొత్తం 18 మంది ప్రతివాదులకు నోటీసులు జారీచేసింది. కోర్టులో ఆధారాల చోరి కేసు మాత్రమే కాకుండా.. కాకాణి గోవర్థన్‌ రెడ్డి, తదితరులపై నెల్లూరు కోర్టులో పెండింగ్​లో ఉన్న ఫోర్జరీ కేసును సీబీఐకి ఎందుకు అప్పగించకూడదో చెప్పాలని ప్రతివాదులను ఆదేశించింది.

ఇదీ చదవండి:'మీసేవా' కార్యకలాపాల్లో.. ప్రభుత్వం జోక్యం చేసుకోవద్దు: హైకోర్టు

ABOUT THE AUTHOR

...view details