HC ON RBK AND JAGANANNA HOUSES IN GRAVEYARDS: ఎస్సీ శ్మశాన వాటికల్లో ఇళ్ల నిర్మాణాల అంశంపై హైకోర్టులో విచారణ జరిగింది. నవరత్నాల్లో భాగంగా ఎస్సీ శ్మశాన వాటికల్లో ప్రభుత్వం ఇళ్లు కేటాయించగా.. ఆ నిర్ణయాన్ని సవాల్ చేస్తూ హైకోర్టులో కపిలేశ్వరం వాసి యాకోబు పిల్ దాఖలు చేశారు. శ్మశాన వాటికల్లో ఇళ్ల కేటాయింపు దారుణమని పిటిషనర్ తరఫు న్యాయవాది జడ శ్రావణ్ వాదించారు. న్యాయవాది వాదనలతో ఏకీభవించిన న్యాయస్థానం.. ఎస్సీ శ్మశాన వాటికల్లో ఆర్బీకేలు, జగనన్న ఇళ్ల నిర్మాణాలు చేపట్టవద్దంటూ ఆదేశాలు జారీ చేసింది.
శ్మశాన వాటికల్లో ఆర్బీకేలు, జగనన్న ఇళ్ల నిర్మాణాలు చేపట్టవద్దంటూ హైకోర్టు ఆదేశం - కపిలేశ్వరం వాసి యాకోబు
HIGH COURT శ్మశాన వాటికల్లో ఆర్బీకేలు, జగనన్న ఇళ్ల నిర్మాణాలు చేపట్టవద్దంటూ ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది. ఎస్సీ శ్మశాన వాటికల్లో ఇళ్ల నిర్మాణాల అంశంపై హైకోర్టులో నేడు విచారణ జరిగింది.
HIGH COURT